వరదలు వచ్చాయి. ఎవరూ పట్టించుకోలేదు. తిప్పలు పడిన వాళ్లు పడ్డారు. ప్రజలు ఇన్ని కష్టాల్లో ఉంటే.. కనీసం సాయం చేయలేదని ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి . సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నంచి కదలరేమని ప్రశ్నించారు. దీంతో జగన్ రెడ్డి… పరామర్శలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడైనా ఆయన ఉదయం తాడేపల్లిలో బయలుదేరితే… మధ్యాహ్నానికి ఇంటికి చేరుకునేలా షెడ్యూల్ ఉంటుంది . కానీ ఈ సారి మాత్రం… రెండు రోజులు ప్లాన్ చేసుకున్నారు.
జగన్ రెడ్డి పర్యటనల్లో రెండు రోజులు అని ఉంటుంది… మొదటి నుంచి ఈ రెండు రోజుల ప్లాన్ వైవిధ్యంగా ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి ఓ చోట బస చేసి.. తర్వాతి రోజు ఉదయమే తిరిగి వెళ్తారు. దీన్ని రెండు రోజులుగా ప్రచారం చేసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి చేసే దీక్షలుకూడా ఇలాగే సాగేవి. ఇప్పుడు గోదావరి వరదల బాధితుల పరామర్శలు కూడా అలాగే సాగనున్నాయి. అయితే ఈ సారి బాధితులు తిరగబడే చాన్స్ ఉంది కాబట్టి.. ఎంపిక చేసిన ట్రైనింగ్ ఇచ్చిన వారిని మాత్రమే కలుస్తారు. వేరే ఏ మీడియాను అనుమతించరు.
మొత్తం స్క్రిప్టింగ్ ప్రకారం టూర్ జరిగిపోతుంది. ఇంత మాత్రం దానికి పర్యటనలు ఎందుకని ఎవరికైనా అనుమానం వస్తుంది. కానీ… ప్రచారం చేసుకోవడానికి .. .. అంతా బాగుగా ఉందని.. గొప్పగా పని చేసిందని కొంత మందితో చెప్పించుకోవడానికి.. అలాగే గోదావరి జిల్లాలో పార్టీ నేతల మధ్య గొడవల పరిష్కారానికి ఈ టూర్ అన్నమాట.