ఎన్నికల్లో విపరీతంగా కష్టపడినందున.. కుటుంబంతో కలిసి.. విహారయాత్రకు జగన్మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్ వెళ్లారని.. కొద్ది రోజుల క్రితం… వైసీపీ వర్గాలు.. మీడియాకు లీకులు ఇచ్చాయి. అలా ఇచ్చిన తర్వాత ఆయన… కనిపించలేదు. ప్రతీ సారి ఏదైనా విదేశీ ట్రిప్‌కి వెళ్తే… బంగీ జంప్ చేసో.. రెస్టారెంట్లో కూర్చుని.. ఉన్న ఫోటోనో… బయటకు వదిలేవారు. ఈ సారి అలాంటిదేమీ చేయలేదు. ఇరవై ఏడో తేదీన ఆయన … హైదరాబాద్ తిరిగి వస్తారని అప్పుడు చెప్పారు. తీరా ఇరవై ఏడు వచ్చే సరికి.. తూచ్.. జగన్ స్విట్జర్లాండ్ పోలేదని… చెబుతున్నారు. ఆయన ఇండియాలో శీతల ప్రాంతాలకు కుటుంబంతో సహా వెళ్లారని.. అంటున్నారు. ఇంతకీ ఎక్కడకు వెళ్లారంటే… హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నారని అంటున్నారు.
మొదట చండీఘడ్ వెళ్లారని.. ఆ తర్వాత కులు-మనాలీ వెళ్లారని .. ఈ రోజో.. రేపో తిరిగి వస్తారన్న ప్రచారం వైసీపీ వర్గాలు ప్రారంభించాయి. ఉత్తరాది పర్యటనకు వెళ్తూ…. స్విట్జర్లాండ్‌కు వెళ్తున్నట్లుగా.. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రచారం చేసుకున్నారన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. రాజకీయ కోణంలో.. ఆయన పర్యటనను తోసిపుచ్చలేమన్న చర్చ కూడా జరుగుతోంది. ఐదారు రోజుల పాటు.. చండీగఢ్‌తోపాటు.. ఇత పర్యాటక ప్రాంతాలకు వెళ్లినట్లుగా చెబుతున్నప్పటికీ… రహస్యంగా ఉంచారు. విషయం బయటకు రాలేదు. అంటే.. అది రహస్యంగా కీలక కార్యక్రమాలు చక్క బెడుతున్నారన్న చర్చ టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా.. కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. కులు-మనాలీలో ఆయన మూడు రోజుల పాటు వేసవి విడిదిలో ఉంటారని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. చంద్రబాబు కులు-మనాలీకి వెళ్లారని తెలిసిన తర్వాతే.. జగన్ కూడా… స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లలేదని… ఉత్తరాది పర్యటనలో ఉన్నారన్న విషయాన్ని వైసీపీ వర్గాలు బయటపెట్టాయి. మొత్తానికి విహారయాత్రల విషయంలోనూ.. జగన్మోహన్ రెడ్డి… తప్పుడు సమాచారాన్ని బయటకు ప్రచారం చేసుకోవడంలో కారణమేమిటో మాత్రం.. చాలా మందికి అర్థం కావడం లేదు.