అందర్నీ నిరుపేదల్ని చేసి వారికి తలాకొంత రేషన్ బియ్యం.. ఖర్చులకు పదో పరకో ప్రభుత్వం నుంచి పడేసి.. వారిని ఓటు బ్యాంకులుగా మార్చుకోవడం అన్నది జగన్ రెడ్డి వ్యూహం. రాయలసీమ ఫ్యాక్షనిస్టులు చేసేది ఇదే. తమ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేసి.. వారికి తిండిగంజలు ఇచ్చి… బానిసలుగా చేసుకుంటారు. తామే దేవుళ్లం అన్నట్లుగా వ్యవహరిస్తూంటారు. జగన్ రెడ్డి రాష్ట్రమంతా ఇదే అమలు చేస్తున్నారు. ఐదేళ్లలో ఆయన చాలా మందడుగు వేశారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దేశంలోకెల్లా ఏపీ యువత అత్యంత నిరుద్యోగంలో ఉన్నారు. ఏపీలో నిరుద్యోగిత రేటు 24 శాతం దాటిపోయింది. అంటే యువతకు పని పాటల్లేక.. జులాయిగా తిరుగుతున్నారు. వారికి ఉపాధి దొరకడం లేదు. యువశక్తి నిర్వీర్యమైపోతోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ 24 శాతం నిరుద్యోగిత లేదు. చివరికి బీహార్ లో కూడా. నిజానికి బీహార్ క్రమంగా మెరుగుపడుతోంది. కానీ ఏపీ పరిస్థితి ఉన్నత స్థానం నుంచి రోజు రోజుకు దిగజారిపోతోంది.
ఏపీలో పరిశ్రమలను ఆకర్షించడం లేదు.. ఉత్తత్తి ప్రకటనలతో సమయం గడిపేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వీర్యం చేశారు. అసలు ఏ ఉపాధి రంగాన్నీ వదలకుండా ధ్వంసం చేశారు. చివరికి చిరు వ్యాపారులకూ గడ్డు పరిస్థితి తీసుకు వచ్చారు. ఉద్దేశపూర్వకంగా ప్రజల ఆర్థిక పునాదుల్ని కుంగదీశారు. భవిష్యత్ లో జగన్ రెడ్డి పాలనా ప్రభావాలు ప్రజలపై చాలా ఎక్కువగా ఉండనున్నాయి.