ఏపీ ఐఏఎస్‌లు ఫైల్స్ దొంగలుగా మారారు. జగన్ రెడ్డి దోచుకోవడానికి కావాల్సినంతగా సహకరించి అందులో తాము కూడా కొంత వాటా తీసుకున్న పాపం ఇప్పుడు వెంటాడుతోంది.దాంతో ఆధారాలను చెరిపేయడానికి అంటూ పెద్ద ఎత్తున రికార్డును ధ్వంసం చేసి తగులబెట్టేందుకు వెనుకాడటం లేదు. సీనియర్ ఐఏఎస్‌గా పని చేసి రిటైరైన సమీర్ శర్మ.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. ఆ శాఖ వేదికగా ఆయన చేసిన దందా అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే ఆయన పేరుతో వైసీపీ నేతలు చేశారు. ఇప్పుడా ఘోరాలన్నీ బయటపడే సమయం వచ్చింది. అందుకే ఏమీ దొరకుండా ఉండేందుకు ఫైల్స్ ను ప్రభుత్వ కారులోనే పంపించి తగులబెట్టాలని డైవర్ కు సూచించాడు. ఆయన తగులబెడుతూ దొరికిపోయాడు.
దొరికిపోయాడు కాబట్టి సమీర్ శర్మ దొంగ కావొచ్చు కానీ.. తెలియకుండా ఎంతో మంది ఐఏఎస్‌లు ఈ పని పూర్తి చేశారు. గనుల శాఖలో అయితే ఐదేళ్లలో ఏం చేశారో డీటైల్స్ లేకుండా ఏరేస్ చేసే ప్రయత్నం చేశారు. ఫలితాలు వచ్చిన రోజునే ఫైల్స్ ను ముక్కలు చేసేసి దొరికిపోయిన అధికారులు ఉన్నారు.
ఎక్సైజ్ శాఖలో డాక్యుమెంట్లు తీసుకెళ్తూ వాసుదేవరెడ్డి దొరికిపోయాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. చాలా నిర్ణయాలకు సంబంధించిన నోట్ ఫైల్స్ ను నాశనం చేసేశారు. దాదాపుగా అన్ని శాఖల్లోనూ ఈ తంతు నడుస్తోంది. ఐపీఎస్‌లు కూడా తగ్గలేదు. రాజకీయ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల పత్రాలను కొల్లి రఘురామిరెడ్డి ముందుగానే తగులబెట్టించారు.
ఐఏఎస్‌లు సాదాసీదా ఉద్యోగులు కాదు. వారికి ముస్సోరిలో ట్రైనింగ్ ఇచ్చారు. నీతి నిజాయితీ అంటే ఏమిటో…వారి బాధ్యతలు దేశానికి ఎంత ముఖ్యమో చెప్పారు. కానీ వారు.. రాజకీయ నాయకుల కోసం కింది స్థాయి ఉద్యోగుల కన్నా దిగజారి ప్రవర్తించారు. ప్రజాధనం దోచుకుంటే… తమకు కొంత విదిలిస్తే చాలన్నట్లుగా వ్యవహరించారు. అడ్డగోలుగా దొరికిపోయారు. ఓ సివిల్ సర్వీస్ వ్యవస్థను జగన్ ఇలా దిగజార్చాడు. తప్పు ఆయనది కాదు.. శిక్షణ పొందినా ఏ మాత్రం నీతి నిజాయితీ లేని సివిల్ సర్వీస్ అధికారులదే.