పార్టీపై తీవ్రమైన నిందలేస్తున్నా ఎవరిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితికి సీఎం జగన్ వెళ్లిపోయారు. సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్రమైన ఆరోపణలు రోజూ చేస్తున్నా ఆయనను కనీసం సస్పెండ్ చేయలేకపోయారు. అనర్హతా వేటు వేయిస్తామని ప్రత్యేక విమానాల్లో తిరిగారు కానీ.. కనీసం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాు, ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేలు గొంతు విప్పుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఆరోపణలు చిన్నవి కావు. ప్రభుత్వ నైతికతను ప్రశ్నించేవి. కానీ సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లే్రు
శ్రీధర్ రెడ్డి తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారని ఇక చర్యలేం తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. అంత స్ఫష్టంగా చెప్పిన తర్వాత ఆయనను పార్టీలో ఎందుకు ఉంచుకుంటున్నారో సజ్జల క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆయనను పార్టీలోనే ఉంచితే మరిన్ని తీవ్ర ఆరోపణలు చేస్తారు. ఒక వేళ సస్పెండ్ చేస్తే మరింత దాడి చేస్తాడు.. ఈ భయంతోనే సజ్జల ఆయనపై ఆయనపై ఏ చర్యలూ తీసుకోలేమనే నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీఎం జగన్ కూడా… చర్యల విషయంలో ధైర్యం చేయడానికి సిద్ధంగా లేరు.
సొంత ఎమ్మెల్యేలు… ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తున్నామని చెబుతున్నారు కాబట్టి అనర్హతా వేటు వేయించి… ఉపఎన్నికలు తెచ్చేందుకు అవకాశం ఉంటుంది.. ఇప్పుడు ఉపఎన్నికలంటే… మన నెత్తి మీద మనం చేయి పెట్టుకున్నట్లేనని వైసీపీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఊరుకున్నంత ఉత్తమం .. బోడిగుండంత సుఖం అని.. ఇలా ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో వ్యవహరించాలని నిర్ణయించారు. అంతకా కావాలంటే కొత్త ఇంచార్జ్ ను నియమించి సైలెంట్ గా ఉండాలనుకుంటన్నారు. కానీ ఆ అసంతృప్త ఎమ్మెల్యేలు మాత్రం వదిలి పెట్టరుగా !