అధికారంలోకి రాగానే పోలీసులకు వీక్లీఆఫ్ ప్రకటించారు. దేశమంతా ప్రచారం చేసుకున్నారు. కొన్ని జాతీయ మీడియాల్లోనూ పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్న రాష్ట్రం అని ఆర్టికల్స్ రాయించుకున్నారు. మూడున్నరేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ పోలీసులకు వీక్లీఆఫ్ అమలు కావడం లేదు. ఈ విషయాన్ని సీఎం జగన్ స్వయంగా చెప్పుకొచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ప్రసంగించిన జగన్.. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడం తన కోరిక అని.. తాను సిబ్బంది కొరత కారణంగా అమలు చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు.
సిబ్బందిని నియమించకుండా మరి మూడున్నరేళ్లుగా ఏం చేస్తున్నారన్నది జగన్ చెప్పలేదు. అధికారంలోకి వస్తే ప్రతీ ఏడాది.. ఆరు వేల మంది పోలీసుల్ని భర్తీ చేస్తామని చెప్పారు. పాతిక వేల వరకూ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదికలు ఉన్నాయి. కానీ హడావుడిగా అమరవీరుల సంస్మరణ దినం ముందు రోజున.. పాలనా పరరమైన అనుతులు ఆరు వేల పోస్టులకు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నారు. వాటికి ఆర్థిక శాఖ ఎప్పుు పర్మిషన్ ఇస్తుందో.. ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పడం కష్టం.
పోలీసుల్ని .. పోలీసు వ్యవస్థని ఇష్టారాజ్యంగా రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న జగన్.. వారికి ఇచ్చిన హామీలు కూడా ఉత్తుత్తివేనని ఆయనే అంగీకరించారు. పోలీసుల సంక్షేమానికి చేయాల్సిందేమీ చేయకపోగా.. అలాంటి వాటిని ప్రశ్నించినా కానిస్టేబుల్ ప్రకాష్ ను డిస్మిస్ చేశారు. పోలీసుల్ని కూడా భయపెట్టి తన దారిలో నడిపించుకుంటున్నారన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి. మొత్తంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ అంటూ దేశం మొత్తం చేసుకున్న ప్రచారం మూడున్నరేళ్ల తర్వాత ఉత్తదేనని జగన్ అంగీకరించారు.