ఆంధ్రప్రదేశ్ సీఎం మూర్ఖంగా అన్ని రకాల హద్దుల్ని చెరిపేస్తున్నారు. ప్రభుత్వం వస్తే చాలు ప్రజాధనంతో పార్టీని నడిపించుకోవచ్చని నిరూపిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వాన్నే పార్టీగా భావిస్తున్నారు. పార్టీ పనులన్నీ ప్రజాధనంతో చేసేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో విపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. పార్టీకి , ప్రభుత్వానికి.. పాలనకు… రాజకీయానికి తేడా లేకుండా పరిపాలిస్తున్నారు. రాజకీయం చేస్తున్నారు. ఆయన తీరు చూసి.. .. సామాన్యులు కూడా అవాక్కవుతున్నారు. ఇంత దిగజారుడుతనమేమిటని నోళ్లు నొక్కుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్నది పదహారు నెలలు జైల్లో ఉన్నా… హత్యలు చేసి బెయిల్ పై వచ్చినా విజయగర్వంతో సంబరాలు చేసుకునే మనస్థత్వం ఉన్నవారు కాబట్టి అంతా లైట్ తీసుకుంటున్నారు.
ప్రజాధనంతో సభలు – చేసేది రాజకీయప్రసంగాలు
జగన్ రెడ్డి ఇటీవలి కాలంలో ఒక్క పథకానికి ప్రతీ ఏటా నాలుగైదు సార్లు బటన్లు నొక్కుతున్నారు. ప్రతీ సారి ఫుల్ పేజీ ప్రకటనలు.. వందల కోట్ల ప్రజాధనం… మళ్లీ బహిరంగసభలు..దానికి జనాల్ని సమీకరించడం… వారికి రాజకీయ పాఠాలు చెప్పడం కామన్ అయిపోయింది. ఇది ఏ స్థాయికి దిగజారిందంటే ఎదుటగా బడి పిల్లలు ఉన్నారనే సంగతిని కూడా మర్చిపోయి… రాజకీయ బూతులు అందుకుంటున్నారు . ఎవరైనా పిల్లలకు మంచి మాటలు చెబుతారు. ఈ సీఎం చెప్పే మంచి మాటలేమిటంటే… అరచేతిలో “టోఫుల్” చూపించడం… చంద్రబాబు, పవన్ ను తిట్టడం. చంద్రబాబు, పవన్ ను తిట్టుకోవచ్చు… ఆయనే కాదు పార్టీ నేతలతో ఎంత బూతులుతిట్టిస్తున్నారో కళ్ల ముందే ఉంది.. కానీ పిల్లల ముందు ఎందుకు అనేది అన్ని వర్గాల నుంచి ప్రశ్న.
వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లడానికి ప్రజా ధనమే ఖర్చు
ప్రభుత్వ ఖర్చుతో.. ప్రజాధనంతో నిర్వహించే సభలన్నీ వైసీపీ సభలుగానే మారిపోయాయి. రాజకీయ పార్టీ సభలుగానే మార్చేశారు. వాటిని ప్రభుత్వ కార్యక్రమంగా ఎవరూ భావించడం లేదు. అధికారులు కూడా తాము వైసీపీ నేతలన్నట్లుగా వ్యవహరించడం ప్రారంభించారు. వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుక్కునేందుకు ప్రారంభించిన పథకానికి కూడా.. ప్రభుత్వ ధనం అంటే ప్రజాధనమే వాడుతున్నారు. దానికి ఇంటింటికి మన ప్రభుత్వం అని పేరు పెట్టారు. ఇలా అయితే అసలు వైసీపీ ఇంచార్జులు ఇంటింటికి ఎందుకు వెళ్లాలి.. అక్కడ ఉన్న విపక్ష ఎమ్మెల్యేలు కదా అన్నదానికి ఒక్కరూ సమాధానం చెప్పారు.
సీఎంవో సోషల్ మీడియా ఖాతాల్లో వైసీపీ పోస్టులు
ఎంతకు దిగజారిపోయారంటే.. చివరికి పార్టీ సమావేశాలను కూడా… పార్టీ నేతలతో జరిగే సమీక్షల వివరాలను.. అక్కడ ఆయన చెప్పే నీతులు లాంటి బూతులను సీఎంవో ట్విట్టర్ హ్యాండిల్ లో అప్ లోడ్ చేస్తూంటారు. సీఎంవో ట్విట్టర్ హ్యాండిల్ కు ఓ ఇమేజ్ ఉంటుంది. దాన్ని కూడా పార్టీ కోసం వాడి ఇంత కంటే దారుణమైన సీఎం ఉండరన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. అయితే అవన్నీ ఆయనకు తెలియవని అనుకోవడానికి లేదు.. అన్నీ తెలుసు. వ్యవస్థల్ని.. విలువల్ని మొత్తం నాశనం చేయడమే లక్ష్యం కాబట్టి అన్నీ తెలిసే చేస్తున్నారు. మద్దతిస్తున్న వాళ్లే తెలుసుకోలేకపోతున్నారు.