ఆది సినిమాలో ప్రిన్సిపల్ ఎల్బీ శ్రీరాంను స్టూడెంట్స్ ఆడుకున్నట్లుగా.. ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు.. ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారు. అక్కడ ఆయనకు కావాల్సింది నమస్కారం.. నమస్కారం పెట్టి… కాలేజీకి మస్కా అయినా కొట్టొచ్చు. అలాగే.. ఏపీలో కూడా.. ఏపీ సర్కార్ పెద్దలకు రాజకీయంగా కావాల్సినవి చేసి. జీ హుజూర్ అనేసి.. మస్కా కొట్టేస్తున్నారు. శని, ఆదివారాల్లో.. హైదరాబాద్, ఢిల్లీలకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి అందుబాటులో ఉండటం లేదు. ఇది ఎంతగా అంటే.. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఏదైనా అంశంపై సమీక్ష పెట్టాలనుకుంటే… ఆయా అధికారులు ఉండటం లేదు. వారు లేరనే సమాధానం వస్తోంది. వీరి వారాంతాల ప్రయాణ ఖర్చు కూడా ప్రజల సొమ్మే తీసుకుకుంటున్నారు. అంతేనా.. మరి ఐదు రోజుల్లో పని చేస్తున్నారా.. అంటే .. వారి క్యాంపాఫీసులు దాటి బయటకు రావడం లేదు. ఫైల్స్‌ను అక్కడికే తెచ్చి క్లియర్ చేసేస్తున్నారు.
అందరూ.. తమకు అనుకూలంగా పని చేస్తున్న వారే కావడంతో… ప్రభుత్వం వారిని గట్టిగా మందలించలేని పరిస్థితి ఉంది. అలాగని బదిలీ కూడా చేయలేరు. ఇలా వారాంతాలలో వెళ్లే వారు 70శాతం వరకూ ఉంటున్నారు. వీరందర్నీ బదిలీ చేసినా.. మళ్లీ ఇలా వెళ్లే వాళ్లనే నియమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ అధికారుల కుటుంబాలు… చాలా తక్కువగానే రాజధానిలో ఉంటున్నాయి. హైదరాబాద్, ఢిల్లీల్లోనే ఎక్కువగా కుటుంబాలను ఉంచుతున్నారు. వారాంతాల్లో అక్కడికి వెళ్లిపోతున్నారు. వీరిని ఇక వెళ్లకుండా చేయడానికి.. సీఎస్ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ మెమో జారీ చేశారు. వారాంతాల్లో కూడా అందరూ విజయవాడలోనే ఉండాలని… సచివాలయంలో పని చేయకుండా.. క్యాంపాఫీసుల్లోనే విధులు నిర్వహించడం తగ్గించాలని.. ఆదేశించారు.
అయితే.. చీఫ్ సెక్రటరీ కన్నా ఇప్పుడు… పవర్ ఫుల్ మనుషులు ప్రభుత్వంలో ఉన్నారు. ఇలా శని, ఆదివారాల్లో కనిపించకుడా పోతున్న సివిల్ సర్వీస్ అధికారులు చాలా మంది.. తెలివి మీరిపోయినట్లే. ప్రభుత్వ సలహాదారులతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిచేవాళ్లే. వాళ్లు చెప్పినట్లు చేస్తూ వాళ్ల అభిమానం పొందిన వాళ్లే. అందుకే.. వారెవరూ. .. సీఎస్‌ను.. ఆమె మెమోను సీరియస్‌గా తీసుకోరని అంటున్నారు. ఏపీ పాలనా వ్యవస్థ గందరగోళంలో పడిందనడానికి ఇదే నిదర్శనమన్న విమర్శలు … గట్టిగానే వినిపిస్తున్నాయి.