ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యసలహాదారుగా.. మూడు నెలల్లో అధికారవర్గాల్లో పూర్తి పట్టు సాధించిన కల్లాం అజేయరెడ్డి అలియాస్ అజేయకల్లాం.. త్వరలోనే తన పదవికి రాజీనామా చేయడం ఖాయమని ఏపీ సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన సలహాలు జగన్మోహన్ రెడ్డికి నచ్చడం లేదని.. పవర్ పర్చేజింగ అగ్రిమెంట్ల విషయంలో.. తనను అజేయకల్లాం తప్పుదోవ పట్టించారని.. జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయనకు ప్రాధాన్యం ఇటీవలి కాలంలో తగ్గిపోతూ వస్తోంది. ఆయనపై జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విశ్వాసం కోల్పోయారని.. ప్రభుత్వ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. దీంతో… సీఎం ముఖ్యసలహాదారు పదవికి రాజీనామా చేయడం ఖాయమంటున్నారు.
పీపీఏల విషయంలో ఏమీ చేయలేకపోయినందుకేనా..?
కల్లాం అజేయరెడ్డి చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీగా పని చేశారు. అయితే అది చాలా కొద్ది కాలం మాత్రమే. రిటైరైన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. వైసీపీ నాయకత్వానికి దగ్గరయ్యారు. ఎన్నికల సమయంలో.. జిల్లాలు తిరిగి విస్తృతంగా మేధావులతో సమావేశాలు పెట్టారు. అనేకాకనేక అవినీతి ఆరోపణలు చేశారు. ఆయన సీఎస్‌గా పని చేసి ఉన్నారు కాబట్టి… ఆ అవినీతి ఆరోపణలు నిజమనుకునే పరిస్థితి వచ్చింది. ఆయన చేసిన ఆరోపణల్లో… పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. జగన్‌కు కూడా అదే చెప్పినట్లుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన మాటల్ని నమ్మి.. పీపీఏలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి.. పూర్వాపరాలు ఆలోచించకుండా… వాటిని రద్దు చేయడానికి చర్యలు తీసుకున్నారు. దాంతో.. పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. కేంద్రంతో సంబంధాలు చెడిపోయే పరిస్థితి ఏర్పడింది.
కేంద్రం వద్ద చెడ్డ పేరు తెచ్చారని జగన్ ఆగ్రహంతో ఉన్నారా..?
కల్లాం అజేయరెడ్డి చెప్పినట్లుగా.. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లలో అవినీతికి సాక్ష్యాలు చూపించలేకపోయారు. కనీసం.. కేంద్రాన్ని శాటిస్ఫై చేయగలిగేలా వాదన వినిపించలేకపోయారు. మొదటి నుంచి కేంద్రం నుంచి హెచ్చరిక లేఖలు వస్తున్నా.. జగన్మోహన్ రెడ్డి.. కల్లా అజేయరెడ్డి మాటలు వినే లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చివరికి విద్యుత్ మంత్రి.. ఏపీ సీఎంపై.. బహిరంగంగానే విమర్శలు చేయడం… ప్రభుత్వానికి… ముఖ్యమంత్రికి మచ్చలాగా మారింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అయిపోయి… పీపీఏలు అన్నింటినీ గౌరవిస్తామని ప్రకటించారు. విద్యుత్ సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా కొంత మేర విడుదల చేశారు. దీంతో.. గండం నుంచి బయటపడినట్లనిపించుకున్నారు.
ప్రవీణ్ ప్రకాష్, పీవీ రమేష్‌కు పెరిగిన ప్రాధాన్యం..!
కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి … అజేయకల్లాం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోగా.. తనకు చెడ్డపేరు తెచ్చారని భావిస్తున్నారు. అందుకే… ఆయనకు ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్నారు. మూడు రోజుల కిందట.. సీఎంవో ప్రత్యేకాధికారులు, సలహాదారులకు శాఖలను పంపిణీ చేశారు. ఇందులో చాలా వరకు అజేయకల్లాంకు కోత పెట్టారు. అజేయకల్లాం చూస్తారని చెప్పిన ఆర్థిక శాఖ లాంటి వాటికి కూడా.. దువ్వూరి కృష్ణ అనే మరో సలహాదారుకి బాధ్యతలుఇచ్చారు. కొత్తగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్‌ను.. సీఎంవోకు తీసుకు వచ్చి కీలకమైన బాధ్యతలు అప్పగించారు. రిటైరైనప్పటికీ.. ప్రత్యేకంగా విధుల్లోకి తీసుకున్న పీవీ రమేష్‌కు కూడా కీలకమైన శాఖలు అప్పగించారు. దీంతో.. కల్లాం అజేయరెడ్డి ఎగ్జిట్ గేటు దగ్గర ఉన్నారని అధికారవర్గాలకు కన్మర్మ్ అయిపోయిందంటున్నారు.