చంద్రబాబు ప్రారంభించిన సీ ప్లేస్ మీద ఆదివారం పూట కూడా చాట భారతాన్ని తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు జగన్ రెడ్డి. చంద్రబాబు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారని.. కానీ అది 114 ఏళ్ల క్రితమే ఉందని తన రైటర్ ఎవరో రీసెర్చి రాసి ఇస్తే నిజమే అనుకుని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసేశారు. అంటే చాలా పాత ఇన్వెంటరీని చంద్రబాబు కొత్తగా తెచ్చానని ప్రచారం చేసుకుంటున్నారని జగన్ రెడ్డి ఆవేదన.
చంద్రబాబు సీ ప్లేస్ ప్రారంభించారు కానీ తానే తీసుకొచ్చానని ఎప్పుడూ చెప్పలేదు. గతంలో ప్రయత్నించారు కానీ ఇబ్బందులు వచ్చాయని కూడాచెప్పారు. ఇప్పుడు జగన్ రెడ్డి అదే చెప్పుకొస్తున్నారు. దేశంలో చాలా డ్యాములు ఉన్నాయి కానీ ఎక్కడా ఎందుకు పెట్టలేదని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అందరూ పెట్టాలని ఎక్కడైనారూల్ ఉందా ?. పర్యాటకానికి పనికి వస్తుందని చంద్రబాబు, కేంద్ర విమానయాన మంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపీలో ఆపరేషన్స్ ప్రారంభించేందుకు నిర్ణయించారు. దానికి కూడా జగన్ రెడ్డి ఏడవడం కాస్త విచిత్రంగానే ఉంటుంది.
అసలు అభివృద్ధి అంటే తాను చేసిందే అని జగన్ ఈ ట్వీట్లో చెప్పుకున్నారు. ఏందంటే.. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించినవి ఆపేసి.. ఐదేళ్ల కాలంలో మళ్లీ ప్రారంభించి.. ఇరవై శాతం..ముఫ్ఫై శాతం పూర్తి చేశానని చెప్పుకోవడం ఆయనే చేసిన అభివృద్ధి. జగన్ రెడ్డితాను చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకోవడానికి వేరే మార్గాలు ఉంటాయి కానీ.. ఇలా చంద్రబాబు ఓ పని చేస్తే దాని మీద ఏడ్చేస్తూ… ట్వీట్లు వేయడం అసహ్యహకరంగా ఉంటుంది. కానీ ఆయనకు అదే ఇష్టం.