ఇద్దరు ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి ఆందోళన కలిగించారు. వారిద్దరి వల్ల మిగతా వారెవరూ.. నోరెత్తడానికి ..ఎవర్నీ కలవడానికి వీల్లేదని..జగన్.. ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు ఎంపీలు.. పార్టీతో సంబంధం లేకుండా.. ఢిల్లీలో లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఇద్దరూ కోస్తా ప్రాంతానికి చెందన ఎంపీలే. ఇద్దరూ వ్యాపారపరంగా.. లావాదేవీలు ఎక్కువగా ఉన్న వాళ్లే. ఇద్దరికీ..సొంత జాగ్రత్తలు అవసరమే. అందుకే.. వారు ఇద్దరూ నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుస్తున్నారు. కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు వారిని ఇంటికి పిలిచి విందులు కూడా ఇస్తున్నారు.
తమ దారిలో తాము పలుకుబడి తెచ్చుకుంటున్న ఆ ఇద్దరిలో ఒకరికి వైసీపీకి ఎలాంటి సమాచారం లేకుండానే పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ గా పదవి కూడా ఇచ్చేశారు. దీంతో జగన్ అప్రమత్తమయ్యారు. అయితే.. ఇప్పటికే వారిద్దరూ బీజేపీకి బాగా దగ్గరవడంతో.. నేరుగా పేర్లు పెట్టి చెప్పకుండా.. జగన్…కాస్త సీరియస్గా వారినే చూస్తూ హెచ్చరికలు జారీ చేసారు. పార్టీ అనుమతి లేకుండానే నేరుగా ప్రధానమంత్రిని కలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు ఎవరైనా ప్రధానమంత్రిని కలవాలంటే పార్టీ అనుమతి తప్పనిసరిగా ఉండాలని, విజయసాయిరెడ్డి అనుమతి లేకుండా ప్రధానిని కలువొద్దని ఆదేశాలు జారీ చేశారు.
పార్టీ లైన్ లోనే అందరూ నడుచుకోవాలని స్పష్టం చేశారు. తన ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహారిస్తే షోకాజ్ నోటీస్ ఇచ్చి బయటకు పంపేందుక్కూడా వెనుకాడనని హెచ్చరించారు. ఈ ఇద్దరు ఎంపీల తీరుపై.. కొద్ది రోజులుగా.. జగన్కు ఇతర ఎంపీలు సమాచారం చేరవేశారు. ఏపీలో బీజేపీ దూకుడు పెరుగుతున్న సమయంలో.. తమ ఎంపీలు కట్టుతప్పి… బీజేపీ ఫోల్డ్లోకి వెళ్తూండటంతో జగన్ అప్రమత్తమయినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.