మీకు ఇసాక్ రిచర్డ్స్ తెలుసా..?. మామూలుగా ఈ పేరు చెప్పి అడిగితే… ఎవరో మాకేం తెలుసు..? అనే సమాధానం వస్తుంది కానీ.. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌లో.. స్టేడియంలో.. ఐస్ క్రీమ్ అమ్ముతూ.. తెలుగులో మాట్లాడిన ఇంగ్లిషాయన.. అంటే ఇట్టే గుర్తుపట్టేయవచ్చు. స్టేడియంలో ఐస్‌క్రీం అమ్ముకుంటూ… తెలుగులో మాట్లాడిన ఆయన మాటలపై అందరూ ముచ్చటపడ్డారు. మనల్ని మనం కించ పర్చుకుంటూ.. పరాయి వాళ్లను పొగడటంలో.. తెలుగు వాళ్లు ఎప్పుడూ ముందు ఉంటారు కాబట్టి… తెలుగు రాష్ట్రాల్లో పుట్టి .. తెలుగు మాట్లాడలేని.. లక్షల మందితో పోలిస్తే… ఈయన తురుంఖాన్ అనిచెబుతూ.. హైలెట్ చేసి పడేశారు. వైరల్ చేసేశారు. ఆ వీడియోకి షేరింగ్స్ .. వ్యూస్ లక్షల్లో వచ్చాయి. దాంతో.. ఇసాక్ రిచర్డ్స్ ఓవర్ నైట్ పాపులర్ అయిపోయారు. అఫ్ కోర్స్.. తెలుగు రాష్ట్రాల్లో లెండి…!. ఆ పాపులాటితో.. యూ ట్యూబ్ చానల్ పెట్టేశాడు. ఇక ఇతర యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చాడు. తెలుగులో మాట్లాడటమే ఇప్పుడు ఆయనకు … ఐస్‌క్రీం అమ్మడం కన్నా.., ఎక్కువగా డబ్బులు సంపాదించి పెడుతోంది.
ఆ తెలుగు సెలబ్రిటి ఇసాక్ రిచర్డ్స్ ఇప్పుడు.. అమెరికాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తారట. న్యూజిలాండ్ నుంచి… అమెరికా వెళ్లి తెలుగు సీఎంను కలిసేంత.. తెలుగు అభిమానమా… అని…” బాబూ చిట్టీ ” తరహాలో.. ఆయన పై మళ్లీ మళ్లీ అభిమానం చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దేశం.. ఆమెరికానేనట. ఆయన ఐస్ క్రీం అమ్ముకోవడానికే.. న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడ ఆ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్లారు. అంతే..ఇప్పుడు.. తెలుగులో మాట్లాడుతూ తెచ్చుకున్న సెలబ్రిటీ హోదాతో… దాన్నే..ఉద్యోగంగా మార్చుకున్నారు కాబట్టి… తెలుగు ఈవెంట్స్నే ఆయనకు… టైంపాస్ జాబ్.
ఇంతకీ.. ఈ ఇసాక్ రిచర్డ్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఏం చేశారు..? ఎలా తెలుగు నేర్చుకున్నారు..? అనేది… చాలా మందికి తెలియదు. ఆయన విశాఖపట్నం, విజయవాడల్లో.. రెండేళ్ల పాటు ఉన్నానని.. ఆ సమయంలోనే.. తెలుగు నేర్చుకున్నానని… ఐస్ క్రీమ్ అమ్ముతూ చెప్పారు. అయితే.. న్యూజిలాండ్‌లోనే ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటే… విశాఖలో.. లేదా.. విజయవాడలో ఐటీ ఉద్యోగం చేసే అవకాశం లేదు. మరి ఏం చేశారు.. చదువుకున్నారా..? అంటే… విశాఖ, విజయవాడల్లో చదువుకుంటే.. న్యూజిలాండ్ వెళ్లి ఐస్‌క్రీమ్ అమ్ముకోవాల్సిన పరిస్థితి రాదు కదా..!. మరేం చేసేవాడు..?. ఆయన గుప్తంగా ఉంచిన అసలు విషయం… ఓ మత ప్రచార సంస్థ తరపున ఆయన… ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లున్నారు. క్రిస్టియన్ మత ప్రచారాన్ని నిర్వహించారు. ఆ సమయంలోనే తెలుగు నేర్చుకున్నారు. ఇప్పుడు.. దాన్నే ఉపాధిగా మార్చుకున్నారు.
ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్లబోతున్న .. జగన్మోహన్ రెడ్డిని అక్కడే కలిసి.. ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లోనే.. బ్రదర్ అనిల్ సాయంతో.. తనే ఓ సంస్థను పెట్టేసి.. తెలుగులోనే సువార్త ప్రసంగాలు చేసి… అందర్నీ.. మరోసారి ఆశ్చర్యంలో ముంచెత్తినా… అబ్బురపడాల్సిన పరిస్థితి లేదనేది.. లెటెస్ట్ టాక్..!