చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన జనానికి చంద్రబాబుపై భయం పుట్టించడానికే కథలు చెప్పారు. చంద్రబాబు వస్తే పథకాలు ఆగిపోతాయని.. ఫ్యాన్ కు రెండు ఓట్లేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. కామెడీ ఏమిటంటే తాను అమలు చేయని.. చేయలేని వాటిని కూడా చేసినట్లుగా చెప్పి.. అవి కూడా ఆగిపోతాయని ప్రజలకు చెప్పడం.
తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా కాంగ్రెస్ గెలవబోతోందని అర్థమైన తర్వాత పూర్తిగా.. ప్రజల్ని భయ పెట్టేందుకే ప్రయత్నించారు. కాంగ్రెస్ వస్తే పథకాలు ఆగిపోతాయి.. కరెంట్ ఉండదు.. అంటూ ఎన్నో రకాలుగా భయపెట్టారు. అయితే అలా ప్రచారం చేయడమే ప్లస్ అయింది. ఇంతగా బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తూంటే.. ప్రజలు మాత్రం ఎందుకు ఆ పార్టీకి ఓటేయకూడదని అనుకున్నారు. అలాగే చేశారు.
ఇప్పుడు అదే స్ట్రాటజీని జగన్ ఫాలో అవుతున్నారు. టీడీపీ హయాంలో అసలు పెద్దగా ఉనికిలో లేని జన్మభూమి కమిటీల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు హామీైలు అమలు చేయడని చెబుతున్నారు. ఆకర్షణీయమైన మేనిఫెస్టోతో వస్తున్నారని కూడా చెబుతున్నారు. అవన్నీ అమలుచేయరంటున్నారు. చంద్రబాబును నమ్మితే చంద్రముఖిలా వస్తారని కూడా అంటున్నారు. గతంలో ఆయన పశుపతి గురించి ప్రస్తావించారు. చంద్రబాబు తాను పశుపతినేనని.. అంటే శివుడినేనని.. జగన్ పాలనను అంతం చేస్తానని కౌంటర్ ఇవ్వడంతో మరోసారి అలాంటి విమర్శలుు చేయలేదు.
జగన్ ప్రసంగం పొడుగుతూ తాను బటన్లు నొక్కానని చెప్పడం … చంద్రబాబు వస్తే.. పథకాలు ఉండవని చెప్పడం తప్ప.. కొత్త విషయం ఏమీ ఉండటం లేదు. మరోసారి గెలిస్తే ఏం చేస్తానో కూడా ఆయన ఒక్క మాట కూడా చెప్పడం లేదు. అందరూ తోలుకొచ్చిన జనమే కావడంతో జగన్ స్పీచ్‌లు టీవీలకే పరిమితమవుతున్నాయి.