జగన్మోహన్ రెడ్డి తనకు హిందూ ఇమేజ్ కోసం మరో కొత్త స్వామిజీ దగ్గరకు వెళ్తున్నారు. విశాఖ శారదాపీఠం స్వామి చేసిన యాగాలు, యాజ్ఞాలు తాను చేసిన పాపాల నుంచి కాపాడలేదని ఆయన అంత తప్ప స్వామి కాదని ఫీలయ్యారో ఏమో కానీ కొత్తగా విజయవాడలో ఓ ఆశ్రమం పెట్టుకున్న విధుశేఖర్ భారతి స్వామి అనే స్వామజీ దగ్గరకు వెళ్లారు. ఆయనతో గంటన్నర పాటు చర్చలు జరిపారు. ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడంలో వైవీ సుబ్బారెడ్డి కీలకంగా ఉంటారు. ఈ సారి కూడా ఆయనే ఏర్పాటు చేశారు.
విజయవాడలోని ఆయన ఆశ్రమానికి జగన్ వెళ్లారు. అంత అర్జంట్ గావెళ్లాల్సిన అవసరం ఏముందో కానీ.. కొత్తగా ఆయన ఓ ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. గతంలో అధికారంలోకి రావడానికి అటు చినజీయర్ తో పాటు ఇటు స్వరూపానంద వద్దకు తరచుగా వెళ్లి కాళ్లు మొక్కేవారు. తాను హిందువునేనని చెప్పుకునేందుకు ఇలా చేసేవారు. అయితే ఇటీవల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆయన శ్రీవారి దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఆగిపోవడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మళ్లీ మెల్లగా తన ట్రాప్ లో పడే స్వామిజీలను ఆయన వెదుక్కుంటున్నారు.
విచిత్రం ఏమిటంటే జగన్ రెడ్డి వస్తున్నాడని తెలిస్తే.. ఆయన కార్యకర్తలు ముందుగా ఓ శవాన్ని రెడీ చేస్తున్నారు. వచ్చి పరామర్శించి వెళ్తారని అనుకుంటున్నారు. విజయవాడలో స్వామిజీ దగ్గరకు జగన్ వస్తున్నారని తెలియగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని వైసీపీ కార్యకర్తలు రెడీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆయన చనిపోయారని జగన్ పరామర్శించాలన్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారని అనుకున్నారు. అయితే స్వామీజీ దగ్గరకు వచ్చి శవాన్ని పరామర్శిస్తే. బాగుండదని జగన్ వెళ్లిపోయారు. దీంతో శవ రాజకీయాలు కుదర్లేదు. వీరి శవం పిచ్చి చూసి జనం కూడా ఇదేం చోద్యం అనుకోవాల్సి వచ్చింది.