ఏపీ సీఎం జగన్ రెడ్డి తన భార్య పుట్టిన రోజున… ప్రజా ధనం ఐదువందల కోట్లు ఖర్చు పెట్టేసి .. రుషికొండకు బోడిగుండు కొట్టేసి నిర్మించిన ప్యాలెస్ లో పార్టీ చేద్దామనుకున్నారు కానీ వర్కవుట్ కావడం లేదని తెలుస్తోంది. తన కాపురం ఇక విశాఖలోనేని ఆయన ఇప్పటికి ఓ డజన్ సార్లు ముహుర్తం పెట్టుకున్నారు. కానీ ఏ ఒక్క సారి కూడా ఆయన ధైర్యంగా విశాఖకు వచ్చి కాపురం పెట్టేశానని చెప్పలేకపోయారు. ఇప్పుడు కూడా అలాంటి ధైర్యం లేకుండా పోయింది.
నాలుగు రోజుల పాటు విశాఖలో కాపురం పెట్టాలని అందు కోసం ఆరేడు తేదీల్లో వెళ్లాలని జగన్ రెడ్డి అనుకున్నారు. మిలీనియం టవర్స్ సహా అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. ఇక చలో అనుకునేలోపే మళ్లీ ఆయన ఇప్పుడు వద్దులే అనుకుంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అది అక్రమ కట్టడం. హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చే వారం .. కేంద్ర పర్యావవరణ మంత్రి త్వ శాఖ బృందం వచ్చి… పరిశీలన చేయనుంది. ఆ తర్వాత హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది.
ఇప్పటికే భారీగా ఉల్లంఘనలు జరిగాయని నివేదిక తేల్చింది. ఇప్పుడు ఆ వివాదం ఉండగానే… అదీ కూడా కోర్టులో ఉండగానే సీఎం హోదాలో ఉన్న తాను కాపురం పెట్టేస్తే… అందరూ ఫీలవుతారని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. ఈ వివాదం పూర్తయిన తర్వాతనే ఆయన విశాఖ వెళ్లాలని అనుకుంటున్నారు. న్యాయపరమైన వివాదాలు ఉన్నందున కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుందామని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. మరో వైపు విశాఖను వర్క్ ప్లేస్ గా డిసైడ్ చేస్తూ.. జీవో ఇవ్వాలని.. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అలా ఇస్తే.. తేడా వస్తుందని ప్రభుత్వ పెద్దలు కంగారు పడుతున్నారని అంటున్నారు.