ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగి రెండు వారాలు దాటిపోయింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి విజయసాయిరెడ్డి ఈ విషయంలో..ఫుల్‌టైం పని చేస్తున్నారు.తన పలుకుబడిని ఉపయోగించి.. అమిత షా అపాయింట్మెంట్ తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపు విషయంపై కేంద్రానికి ఓ మాట చెప్పాలనుకుంటున్నారన్న ప్రచారం.. మూడు వారాలుగా సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్ ప్రకటన చేసిన తర్వాత… జీఎన్ రావు కమిటి రిపోర్ట్ ను..కేబినెట్లో ఆమోదించి..విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించి.. విశాఖకు వెళ్లాలనుకున్నప్పుడే… ఆయనకు అవాంతరాలు ఎదురయ్యాయి.
జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ను నేరుగా.. కేబినెట్లో ఆమోదించలేక… బోస్టన్ గ్రూప్ పేరు చెప్పి..తర్వాత ఆయన విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించడానికి విశాఖ వెళ్లారు. అప్పట్నుంచి.. ఏదో ఓ నివేదిక పేరు చెప్పి.. సమయం గడిచిపోతోంది కానీ.. ఇంకా అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. కానీ..అప్పట్నుంచి.. జగన్మోహన్ రెడ్డి.. అమిత్ షా.. సమయం కోసంచూస్తున్నారు. కానీ దొరకడం లేదంటున్నారు. ఇరవయ్యో తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టదల్చుకున్న విషయాన్ని బహిరంగంగా చెప్పిన తర్వాతకూడా.. జగన్ కుఢిల్లీ నుంచి పిలుపు అందలేదు. ఈ కారణంగానే… వాయిదాలు వేస్తున్నారా.. అన్న సందేహాలు కూడా వస్తున్నాయంటున్నారు. తాము తీసుకునే అన్ని నిర్ణయాలను.. కేంద్రానికి చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.
నిజంగా చెబుతున్నారో లేదో కానీ… పీపీఏలు, పోలవరం వంటి అంశాల్లో… నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర పెద్దల్ని విజయసాయి, బీజేపీ నేతలు కలిశారు. దీంతో కేంద్రానికి చెప్పారని అనుకున్నారు. దీంతో కేంద్రంపైనే విమర్శలొచ్చాయి. ఇప్పుడు అమిత్ షాను కలిసిన తర్వాత జగన్.. అమరావతిని తరలిస్తే…తాను కేంద్రానికి చెప్పే చేశానని జగన్ ప్రచారం చేసుకుంటారేమోనని.. బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. మరి ఏది నిజమో..?