ఏపీ సీఎం జగన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారు. విజయవాడ ఎయిర్ పోర్టు హ్యాంగర్ లో ప్రత్యేక విమానం రెడీగా ఉంది. ఢిల్లీ నుంచి కాల్ రాగానే హ్యాంగర్ నుంచి చొక్కా తీసుకుని .. వేసేసుకుని …. విమానం ఎక్కేసి వెళ్లిపోవడానికి సీఎం జగన్ రెడ్డి రెడీగా ఉన్నారు. వారం రోజులుగా ఆయన అలర్ట్ గా ఉన్నారు. ఎప్పుడు ఢిల్లీ నుంచి పిలుపు వస్తుందా .. వెళదాం అని. కానీ ఢిల్లీ పెద్దలు బాగా బిజీగా ఉన్నట్లు ఉన్నారు. ఆయనకు ఇంకా అవకాశం ఇవ్వలేదు. బహుశా ఈ వారంలో చాన్స్ రావొచ్చి వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ రెడ్డి ప్రతి నెల ఆఖరులో ఢిల్లీ వెళ్లడం అనేది ఇటీవల కామన్ ప్రాక్టిస్ గా మారింది. మొదట్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్లేవారు. తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ అధికారులు వెళ్లారు. ఇప్పుడు నేరుగా జగన్ రెడ్డే రంగంలోకి దిగుతున్నారు. నెలాఖరులో వెళ్తూండటంతో అదపున అప్పుల కోసమో లేకోపోతే నిధుల కోసమే అని అనుకుంటూ ఉంటారు. కానీఎందుకెళ్తారో ఎవరికీ తెలియదు. లోపలేం జరిగిందంటే అని నాలుగేళ్ల నుంచి ఒకే ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నారు.
జగన్ రెడ్డి ఢిల్లీవెళ్లిన ప్రతీ సారి ఊరట పొందుతూనే ఉన్నారు. అది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. సొంత ప్రయోజనాల విషయంలో. అవినాష్ రెడ్డి సహా అనేక అంశాల్లో. జగన్ రెడ్డి లాబీయింగ్ ఎలా ఉంటుందంటే కోర్టులో ఉన్న స్థలాల్లో కూడా ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అంగీకరించేంత . కేంద్రమే ఇలా లిటిగేషన్ ల్యాండ్స్ లో ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఇస్తే.. ఇక చట్టం. రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేయాల్సి ఉంటుది ? .