జగన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దుర్వినియోగం చేశారో బయటపడుతున్నాయి. గత జీవోలు అన్నీ ప్రభుత్వం పబ్లిక్ లో పెడుతోంది. ఇందులో ఆ వివరాలు ఉంటున్నాం.ి అవసరం ఉన్నా లేకపోయినా కోర్టుల్లో వాదనలకు లాయర్లను నియమించడం వారికి లక్షలకు.. లక్షలు సమర్పించడం అనేది ఓ వ్యాపకంగా మారిపోయిందని జీవోలను చూస్తే అర్థమవుతుంది. ప్రతీ చిన్న విషయానికి కింది కోర్టు నుంచి పై కోర్టు వరకూ పిటిషన్లు వేసుకుంటూ పోయారు. కనీసం ఒక్క శాతం మెరిట్ లేదని తెలిసినా తగ్గలేదు.
ప్రభుత్వం లాయర్లను జీతానికి నియమించుకుంటుంది. వారికి కేసుల వారీగా చెల్లింపులు ఉండవు. కానీ వైసీపీ ప్రబుత్వం మాత్రం పొన్నవోలు లాంటి వాళ్లను ఏఏజీగా పదవిలో నియమించినప్పటికీ కేసుల వారీగా చెల్లించింది. లాయర్లకు కొన్ని కోట్ల రూపాయలు చెల్లిస్తే అందులో అత్యధిక మొత్తం ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికే సమర్పించుకున్నారు. కేసుల వారీగా డబ్బులు చెల్లించడానికి ప్రభుత్వ పదవిలో ఉండాల్సిన పని లేదు. కానీ ఆయన ప్రభుత్వ పదవిలో ఉంటూ జీతం తీసుకుంటూ.. మళ్లీ కేసుల వారీగా డబ్బులు తీసుకున్నారు. ఈ విషయం జీవోలో స్పష్టమయింది.
ఒక్కొక్క జీవో వెలుగులోకి వస్తోంది. పదేళ్ల కాలంలో .. ఒక్క అమరావతి కేసుల వాదన కోసం ఢిల్లీలో ఓ లాయర్ కు ఏక మొత్తంగా ఐదు కోట్లు చెల్లించిన దగ్గర నుంచి ఆ తర్వాత రహస్యంగా ఎంత మంది ఎన్ని వందల కోట్లు చెల్లించారో బయటకు వస్తున్నాయి. వీరందరికీ జగన్ మోహన్ రెడ్డి తన కేసులు.. తన పార్టీ నేతల కేసులు వాదించినందుకు.. ప్రజాధనాన్ని ఈ రూపంలో ఇచ్చి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.