ముఖ్యమంత్రి ప్రజాసొమ్ముకు కస్టోడియన్. ప్రజలు శ్రమ చేసి రూపాయి రూపాయి పన్నులుగా కడితే వచ్చే సొమ్మును అంతే జాగ్రత్తగా ప్రజోపయోగం కూడా వాడాలి. కానీ జగన్ ఐదేళ్ల పాటు ఏం చేశారు. ప్రభుత్వ ఖజానాలోకి వచ్చే ప్రతి రూపాయి తన కోసమే అన్నట్లుగా వ్యవహరించారు. తన కోసం.. త నకుటుంబం కోసం వెచ్చించేందుకు వెనుకాడలేదు. జగన్ మోహన్ రెడ్డిన ఇంటికి యాభై కోట్లతో సోకులు చేసుకోవడం ఒక్కటే కాదు.. ఆయన బోగాలు తెలియనివిని ఎన్నో ఉన్నాయి.
ప్రైవేటు ఆస్తికి ప్రజాధనంతో సోకులా ?
తాడేపల్లిలో ఆదిశేషగిరిరావు వేసిన వెంచర్లో రెండు ఎకరాల్లో జగన్ ఇల్లు కట్టుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇంటికి మొండిగోడలే ఉన్నాయి. ఆయన సీఎం అయిన తర్వాత కిటికీలు సహా మొత్తం ప్రజాధనంతో నిర్మించేసుకున్నారు. చివరికి డోర్ మ్యాట్లు కూడా ప్రజాధనంతో కొన్నవే. ఇందు కోసం కోట్లు వెచ్చించారు. యాభై కోట్లతో అద్భుతమైన సీఎం నివాసం నిర్మించవచ్చు. కానీ అంత మొత్తంతో తన ఇంటికి సోకులు చేయించుకుని గుట్టుగా వాడేసుకుంటున్నారు. ఏ సీఎం అయినా… తన ఇంటికి ఒక్క రూపాయిప్రజాధనం పెట్టాలంటే సిగ్గుపడతారు.కానీ జగన్ రెడ్డి మాత్రం వేరే.
సొంత వ్యాపార సంస్థలకు ప్రజాధనం దోచి పెట్టిన సీఎం
జగన్ రెడ్డికి బినామీ సూట్ క ేసు కంపెనీలు చాలా ఉన్నా.. నికరంగా వ్యాపరం చేస్తున్నవి సాక్షి దినపత్రిక, భారతి సిమెంట్స్ మాత్రమే. భారతి సిమెంట్స్ లో 51 శాతం ఫ్రాన్స్ కంపెనీకి అమ్మేసి వేల కోట్లు తెచ్చుకున్నారు. కానీ అంతా ఓ గూడుపుఠాణి. కంపెనీ జగన్ కుటుంబం చేతుల్లోనే ఉంది. ఈ రెండు కంపెనీలకు ఐదేళ్లలో ప్రజాధనం ఎన్ని వేల కోట్లు దోచి పెట్టారో లెక్కలన్నీ బయటకు వస్తే ప్రజలు మూర్చపోతారు. సాక్షి పత్రిక సర్క్యూలేషన్లో డెబ్బయి శాతం ప్రజల డబ్బుతోనే.. మళ్లీ దానికి వందలకోట్లలో ప్రకటనలు.. సాక్షి ఉద్యోగులకు ఖజానా నుంచి జీతాలు .. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలు బయటకు రావాల్సి ఉంది. ఇక భారతి సిమెంట్స్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఏపీలో జరిగిన ప్రతి నిర్మాణానికి భారతి సిమెంట్స్ వాడారు. రేటు పెంచి మరీ అందరూ కొనుగోలు చేసేలా చేశారు.
రుషికొండ ప్యాలెస్ – లగ్జరీ ఫ్లైట్స్… హెలికాఫ్టర్స్
ప్రజలు తాను అకౌంట్లలో వేస్తున్న చిల్లర తీసుకుని తనకే ఓట్లేస్తారని తనకు తిరుగులేదని తాను రుషికొండ మీద జల్సా చేయాలని ఐదు వందలకోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. పర్యావరణ నిబంధనలు.. సుప్రీంకోర్టు రూల్స్ ఏవీ పట్టలేదు. జగన్ రెడ్డి మనస్థత్వానికి రుషికొండ ప్యాలెస్ ఓ ఉదాహరణ. ఇక ఎక్కడికి వెళ్లాలన్నా స్పెషల్ ఫ్లైట్లే. రెండు కిలోమీటర్లకు హెలికాప్టర్ రైడ్. ప్రజాధంతో జగన్ అనుభవించిన రాజభోగాలకు అంతే లేదు. ప్రజాధనాన్ని ఇలా సొంతానికి వాడుకున్న ఒక్కరంటే ఒక్క సీఎం కూడా చరిత్రలో ఉండరు.