ఐదు రోజులపాటు పులివెందులలో ఉండేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నా జగన్ మూడు రోజులకే బెంగళూరుకు వెళ్ళిపోయారు. ఆయనను కలిసేందుకు పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు వరుసగా వస్తున్నా..సడెన్ గా పులివెందుల నుంచి జగన్ మకాం మార్చడం చర్చనీయాంశంగా మారింది.
బెంగళూరుకు వెళ్లాలని జగన్ అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి అని పులివెందుల పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే, పులివెందుల కౌన్సిలర్ల కాంట్రాక్ట్ బిల్లుల బెడద భరించలేకే జగన్ పులివెందుల నుంచి జారుకున్నారని టాక్ వినిపిస్తోంది. వివిధ పనుల కింద అప్ లోడ్ చేసిన 200కోట్ల పైబడి బిల్లులు .. ప్రస్తుతం కొనసాగుతోన్న 100 కోట్ల పనుల బిల్లులపై జగన్ ను కౌన్సిలర్లు అదేపనిగా అడగడం..ఎంత సర్దిచేప్పినా వెనకపోవడంతో జగన్ ఐదు రోజుల పర్యటన మూడు రోజులకు కుదించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ పులివెందులకు వచ్చిన నాటి నుంచి అదే పనిగా కౌన్సిలర్లు కాంట్రాక్ట్ బిల్లుల కోసం జగన్ నివాసం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పదేపదే ఈ విషయం గురించి తన వద్దకు రాకండని జగన్ సుతిమెత్తగా చెప్పడంతో.. వారంతా భారతి రెడ్డి వద్దకు వెళ్ళగా ఆమె వారిని సముదాయించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక చేసేదేం లేక తమకు బిల్లుల విషయంలో న్యాయం జరగకపోతే వైసీపీని వీడుతామని కౌన్సిలర్లు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతోనే చికాకు గురైన జగన్ రెడ్డి ఉన్నపళంగా పులివెందుల నుంచి మూడు రోజులకే మకాం మార్చారని అంటున్నారు.