ప్రధాని మోదీతో భేటీకి సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఆయనకు ఐదో తేదీన ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో నాలుగో తేదీనే జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు అవకాశాలు ఉన్నాయి. సీఎం జగన్ ప్రతీ నెలాఖరులో ఢిల్లీ వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా నెలాఖరులో వెళ్లాలనుకున్నారు కానీ సాధ్యం కాదు. ఎన్ని అప్పులు చేస్తున్నా డబ్బులు సరిపోవడం లేదు. గత నెల మొదట్లోనే పది వేల కోట్లు ఇచ్చినా సరిపోలేదు.
అమ్మఒడికి బటన్ నొక్కారు కాన డబ్బులు పడలేదు. ఇవాళ జీతాలు కూడా ఓడీ తీసుకుని కొంత మందికి ఇచ్చారు. మొత్తం జీతాలు పడే సరికి పదో తేదీ కావొచ్చని చెబుతున్నారు. మరో వైపు ఏడాది చివరి వరకూ ఇచ్చిన అప్పుల పరిమితి అయిపోవచ్చింది. మళ్లీ పరిమితి పెంచుకోవాల్సి ఉంది. లేకపోతే ఎన్నికలకు ముందు తవ్ర ఇబ్బందులు పడతారు. అలాగే … ఈ పర్యటనలో టీడీపీతో బీజేపీ కలవవొద్దని కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. తమకు పార్లమెంట్ సీట్లు అన్నీ వస్తాయని.. టీడీపీ, జనసేన కు ఒక్కటి కూడా రాదని ఆ పార్టీలతో వెళ్లకపోతే మొత్తం మద్దతు మీకే ఇస్తామని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.
మరో వైపు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సీబీఐ కోర్టులో మళ్లీ ప్రారంభమయింది. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై మూడో తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ అంశాల నేపధ్యంలో జగన్ పర్యటన తర్వాత రాజకీయంగా ఎలాంటి మార్పులొస్తాయన్నదానిపై ఆఆసక్తి ఏర్పడింది.