ఎమ్మెల్యేలతో సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్లో గతంలో ఏది చెప్పారో అదే మళ్లీ చెప్పి పంపించారు. ఇరవై మంది ఎమ్మెల్యేలు గడప గడపకూ తిరగడం లేదని.. వారిని ఫైనల్గా తాను పిలిచి మాట్లాడతానని అప్పటికే మారకపోతే.. టిక్కెట్లివ్వలేనని చెప్పారు. అన్నిరకాల సర్వేల రిపోర్టులు ఉన్నాయని.. అందరూ తమ గ్రాఫ్ మెరుగుపర్చుకోవాల్సిందేని జగన్ స్పష్టం చేశారు. ఎప్పట్లాగే బటన్ల గురించి.. పథకాల గురించి చెప్పారు. సురక్ష పథకం గురించి వివరించారు. తాను చెప్పాలనుకున్నదంతా చెప్పిన తర్వాత సెలవు తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే రిక్వైర్ మెంట్స్ లేదా వారి విజ్ఞప్తులు వినే ఆలోచన పెద్దగా చేయలేదు.
ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పదే పదే చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఓవరాల్ ప్రభుత్వ అసంతృప్తి గురించి మాత్రం మాట్లాడటం లేదన్న అంతృప్తి ఎమ్మెల్యేల్లో ఉంది. పైసా నిధులు విడుదల చేయకుండా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించాలంటే ఎలా సాధ్యమన్న వాదన ఎక్కువ మంది ఎమ్మెల్యేల్లో వినిపించింది. కొత్త విషయాలు ఏమీ చెప్పకపోతూండటం..ఎప్పుడూ ఒకే రకమైన మాటలు మట్లాడి సమీక్షను ముుగించేస్తూంటంతో ఎమ్మెల్యేలు కూడా పెద్దగా ఆక్తి చూపించలేదు. ఈ సారి ఎమ్మెల్యేలు ఎవరెవరు వచ్చారు.ఎవరెవరు రాలేదన్నది తెలుసుకునే అటెండెన్స్ కూడా తీసుకోలేదు.
కారణం ఏదైనా వైసీపీ ఎమ్మెల్యేల్లో కనిపించని నిరాశ కనిపిస్తోంది. వెళ్లి కష్టపడి తాము గెలిచి.. వైసీపీని గెలిపించాలని అంటున్నారు కానీ.. అసలు సమస్యలేమిటో విని పరిష్కరించే ఆలోచన కూడా చేయకపోవడం చాలా మంది నిరాశ పరుస్తోంది. ప్రభుత్వమే చేయలేని పనులను తాము ఎలా చేయిస్తామని ఎక్కువ మంది ఫీలవుతున్నారు. అయితే జగన్ ఇవన్నీ పట్టించుకునే ఆలోచనల్లో లేరు.