విశాఖ గర్జన పెడుతున్నాం… మీరు రావొద్దు అని పవన్ ను వైసీపీ నేతలు నేరుగా డిమాండ్ చేస్తున్నారు. మీరు గర్జన పెట్టుకుంటే పవన్ ఎందుకు రాకూడదంటే వారి దగ్గర ఉన్న సమాధానం.. తమ గర్జనను విఫలం చేయడానికే పవన్ వస్తున్నారని. ఈ మాటలతోనే పవన్ అంటే వైసీపీ నేతలు ఎంత భయపడుతున్నారో అర్థం అయిపోతుంది. పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విశాఖ వస్తున్నారు. ఆయన అక్కడ అడుగు పెడితేనే గర్జన ఫెయిలవుతుందని భయపడేవాళ్లు.. ఇక తమకు బలం ఉందని ఎలా అనుకుంటారు ? పవన్ ను ఎదుర్కొని రాజకీయం చేయగలమని ఎందుకనుకుంటారు ?
పవన్ కల్యాణ్ పర్యటన కోసం జనసైనికులు.. భారీగా తరలి వచ్చి.. గర్జనకు పెద్దగా జనం రాకపోతే సమస్య అవుతంది. అందుకే పవన్ కల్యాణ్ విశాఖ రావొద్దని వైసీపీ నేతలంటున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్.. మూడు రాజధానుల విషయంలో తన వ్యతిరేకతను బలంగా వినిపించారు. ఒక్క రాజధాని అమరావతికే మద్దతు ప్రకటించారు. ఇందులో పవన్ కల్యాణ్ దాచుకునేదేమీ లేదు. అయినా విశాఖపై అభిప్రాయం చెప్పాలంటే వైసీపీ నేతలు బేల అరుపులు అరుస్తున్నారు. వైసీపీ నేతల ప్రకటనలు చూసి.. వారి పార్టీ పనైపోయిందని అనుకునే పరిస్థితి వచ్చింది.
వైసీపీ పరాజయానికి ఘోర పరాజయనికి మధ్య తేడా పవన్ కల్యాణే అన్నట్లుగా మారుతోంది పరిస్థితి. ఉత్తారంధ్ర నుంచి నెల్లూరు వరకు పవన్ కల్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారని..ఆయనను నిర్వీర్యం చేయకపోతే మొదటికే మోసం వస్తుందని వైసీపీ అనుకుంటోంది. అందుకే ఎదురుదాడికి దిగుతోంది. కానీ వైసీపీ చేస్తున్న చేష్టల వల్ల పవన్ మరింత బలం పుంజుకుంటున్నారు. తమ చేష్టలతో మొత్తంగా జనసేన అంటే భయపడుతున్నామని వైసీపీ నేతలు చెప్పకనే చెబుతున్నారు.