నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు , ఆయన సోదరుడు కలిసి చంద్రబాబును అంతమొందించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. నందిగామలో జరిగిన రాళ్ల దాడి అందులో భాగమని గుర్తించారు. కరెంట్ తీసేసి రాళ్ల దాడి చేసేలా స్కెచ్ వేసినట్లుగా గుర్తించి అరెస్టులు చేశారు
నందిగామ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చంద్రబాబును చంపడానికి ఘోరమైన కుట్రలు చేస్తున్నారని తెలియడంతోనే ఆయనకు భద్రతను రెట్టింపు చేశారు. ఎన్ఎస్జీ కమెండోలను డబుల్ చేశారు. ఈ పోలీసుల్లో రాష్ట్ర పోలీసులే భాగమని కేంద్ర ఇంటలిజెన్స్ కు స్పష్టమైన సమాచారం అందడంతోనే ఈ భద్రతను ఏర్పాటు చేసినట్లుగా అప్పట్లోనే ప్రచారం జరిగింది.
చంద్రబాబు ఎక్కడుకు వెళ్లినా రాళ్ల దాడులు చేయడానికి కొన్ని బృందాలు రెడీగా ఉండేవి. పోలీసులు వారిని అడ్డుకునేవారు కాదు. అలా ఎన్ని సార్లు దాడులు జరిగాయో లెక్కలేదు. కుప్పం, అంగళ్లు, మార్కాపురం, అమరావతి, నందిగామ ఇలా లెక్కలేస్తే కనీసం పది చోట్ల దాడులు జరిగాయి. ప్రతీ చోటా ఓ భయంకరమైన కుట్ర ఉంది. మార్కాపురంలో ఓ పెద్దాయన చనిపోయారు.
ఈ దాడులన్నీ ప్రీ ప్లాన్డ్ అని.. పోలీసు ఇంటలిజెన్స్ సహకారంతోనే.. ముందస్తుగా దాడులు చేసే వారికి ట్రైనింగ్ ఇచ్చి పోలీసులు అడ్డుకోకుండా చూసి చేశారని భావిస్తున్నారు. ఒక్క నందిగామ దాడిని కాకుండా.. మొత్తం దాడుల్ని కలిపి విచారిస్తే..అసలు చంద్రబాబు హత్యకు కుట్ర ఎక్కడ జరిగిందో తేలే అవకాశాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.