జగన్ రెడ్డి నమ్మించి గొంతు కోశారని తాడేపల్లి ప్యాలెస్ ముందు ఆయన అనుంగు అనుచరులు విలపిస్తున్నారు. వారంతా జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు ఆయనతో పాటు నడిచిన వారు., పదవుల్ని వదులుకుని రాజీనామాలు చేసి ఆయన వెంట నడిచిన వారు. జగన్ రెడ్డి తీసుకునే ప్రతి తుగ్లక్ నిర్ణయాన్ని అడ్డగోలుగా సమర్థించిన వారు. జగన్ రెడ్డి చెప్పినట్లల్లా విపక్ష నేతల్ని అడ్డగోలు బూతులు తిట్టిన వారు. ఆయన చేసిన తప్పుల్నీ సమర్థించిన వారు ఇప్పుడు ఆయన తమ పైనే అలాంటి నిర్ణయాలు తీసుకుంటూంటే.. అక్రమం.. అన్యాయం అని నిందిస్తున్నారు. కానీ.. కర్మ ఈజ్ విశాఖపట్నం బీచ్ అన్నట్లుగా చివరికి తాము ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతీ దానికి … ఓ తప్పుడు వ్యక్తికి చేసిన సమర్థనే కారణం.
అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి చెలరేగిపోయారు. సొంత రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయడానికి ఎన్ని తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నారు. అయినా ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అది రాష్ట్రానికి మంచిది కాదని.. ఒక్క అభిప్రాయమూ చెప్పలేదు. అలా చెబితే తమకు పార్టీలో పుట్టగతులు ఉండవని వారికి తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నాయా ?. ఎక్కువ మందిని తీసేసి… కొంత మందిని .. .ఓడిపోతారనే ముద్ర వేసి నియోజకవర్గాలు మారుస్తున్నారు. టిక్కెట్ నిరాకరించడం కన్నా అది మరీ ఎక్కువవేసే శిక్షలా మారింది.
మూర్ఖుడు చేసే పనులను సమర్థిస్తే.. రేపోమాపో అతని నిర్ణయాలు తమవద్దకే వస్తాయని వైసీపీ నేతలు అనుకోలేకపోయారు. ఇప్పుడు వారు రియలైజ్ అవుతున్నారు. అయితే ఇంత కాలం చేయాల్సినంత చేసి.. ఏపీ విధ్వంసంలో పాలు పంచుకుని ఇప్పుడు .. తీరిగ్గా అధికారంలోకి వచ్చే పార్టీల్లో చేరిపోతామనుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఏపీ రాజకీయాలు అలా మారిపోయాయి మరి.