వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఆలోచనలు చీప్ .. చీప్ గా ఉంటాయని ఆయన పెట్టించే సిల్లీ కేసులు, అందుబాటులో ఉన్న అర్ధరాత్రుళ్లు తలుపులు బద్దలు కొట్టే అరెస్టుల్ని చూసి ఎవరికైనా అర్థం అవుతుంది. ఎన్నికలకు ముందు కుర్చీ కిందకు నీళ్లు వచ్చేసరికి అలాంటి సిల్లీ ప్రచారాలకు పదును పెడుతున్నారు. ఆయన చేతిలో కూలి మీడియా ఉండటంతో చెలరేగిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రచారాలను ఎవరూ నమ్మకపోవడంతో నవ్వుల పాలయ్యారు.
టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందని.. ఫైల్ మోదీ టేబుల్ మీదకు పోయిందని హఠాత్తుగా ప్రచారం ప్రారంభించారు. ఎన్ని సీట్లు అడుగుతుందో కూడా లెక్క చెప్పారు. ఒక్క శాతం ఓట్లు కూడా లేని.. కనీసం నోటాను దాటని బీజేపీ బోలెడన్ని సీట్లను డిమాండ్ చేస్తోందని అయినా టీడీపీ, జనసేన ఆ పార్టీని కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్నట్లుగా చెప్పుకొచ్చారు. ప్రచారం చేసినంతగా చేసి.. చివరికి సాయంత్రం డిబేట్ పెట్టారు. అందులో వైసీపీ కోవర్టుగా ఉన్న లీడర్ ను తీసుకొచ్చి.. తాము 70 అసెంబ్లీ సీట్లు , 12 లోక్ సభ స్థానాలను అడుగుతామని చెప్పించారు. దాన్నే పెద్ద పెద్ద బ్రేకింగులు వేస్తూ హడావుడి చేశారు.
అసలు బీజేపీతో పొత్తుల కోసం ఎవరూ సంప్రదింపులు జరిపినట్లుగా కానీ.. లేదా బీజేపీ హైకమాండ్ ఎలాంటి అభిప్రాయ సేకరణలు అంటూ జరపలేదని.. ఆ నాయకుడే చెప్పారు. ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు.. ఆ పార్టీని లెక్కలోకి కూడా తీసుకోలేరు. జగన్ రెడ్డితో రాసుకు పూసుకు తిరుగుతుండటంతో.. తమ కూటమిలో కలుపుకోవడనికి టీడీపీ, జనసేన సిద్దంగా లేదు. మీ దోవన మీరు వెళ్లండి.. మాకు ఆశీస్సులివ్వండి అన్నట్లుగా పవన్ తేల్చేశారు. కూలీ మీడియా మాత్రం కొత్త హడావుడి ప్రారంభించింది.
బీజేపీతో ఇప్పటికీ అంటకాగుతోంది వైసీపీ, ఒక్క ఏడాది ఏపీ లాంటి రాష్ట్రానికి లక్షకోట్లు అప్పు ఇచ్చిన.. సర్వనాశనం అయ్యేలా చేస్తోంది. జగన్ రెడ్డికి రాజకీయంగా మేలు చేసే పనులు చేస్తోంది. రాజ్యాంగ పరంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నా చూస్తూ ఉరుకుంది. అన్నింటికి పరిహారంగా ఏదో ఓ చర్యలు తీసుకోకపోతే.. బీజేపీని కూటమిలో చేర్చుకునే అవకాశం ఉండదని టీడీపీ, జనసేన వర్గాలు గట్టిగా భావిస్తున్నాయి.