జగన్ రెడ్డి మిర్చియార్డుకు వెళ్లాడు. అక్కడ ఆయన కార్యకర్తలు, నేతలు తోసుకున్నారు. వెంటనే జగన్ కు భద్రత లేదని వైసీపీ నేతలంతా కోరస్ అందుకున్నారు. వెంటనే గవర్నర్ ను కలిశారు. జగన్ భద్రతపై ఆందోళనగా ఉందని.. అందరూ ఒకే సారి చెప్పారు. చివరికి జగన్ కూడా అదే చెప్పారు. అంతిమంగా వారి డిమాండ్ ఏమిటంటే.. సీఆర్పీఎఫ్ సెక్యూరిటీని కేంద్రం కల్పించాలట.
దేశంలో బోలెడంత మంది మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు.. ఏపీలోనే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయనకు లేని భద్రతను మాజీ ముఖ్యమంత్రి హోదాలో కల్పించాలని ఎలా సాధ్యం?. జగన్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే..కనీస కేబినెట్ హోదా ఉన్న ప్రతిపక్ష నేత కాదు. అప్పటికీ జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అయినా సరిపోదని..తాను సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి భద్రత ఉందో అలాంటిది ఇవ్వాలని జగన్ అంటున్నారు.
జగన్ .. వైసీపీ నేతల హడావుడి చేస్తూంటే.. రేపోమాపో కోడికత్తి లేదా గులకరాయి లాంటి డ్రామా ఏదో అడి అయినా సరే భద్రతనుపెంచుకునేందుకు ప్లాన్ చేసుకున్నట్లుగా ఉందన్న వాదన వినిపిస్తోంది.వారంలో ఐదు రోజులు బెగంళూరు.. రెండు రోజులు తాడేపల్లిలో ఉండేదానికి భద్రత గురించి ఎందుకు ఆందోళన చెందుతున్నారన్న ప్రశ్న వస్తోంది.