ప్రభుత్వ పరంగా.. ఎలాంటి కార్యక్రమం జరిగినా.. ఇక.. ఒక్క జగన్ ఫోటో మాత్రమే కనిపించాలి. ఫ్లెక్సీలు, ప్రచార చిత్రాలు..టీవీ ప్రకటనలు ఏవైనా సరే… వాటిలో.. ఒక్క జగన్ మాత్రమే ఉండాలి. ఇలా కాకుండా.., మంత్రులు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు.. ఇతర ఫోటోలు కూడా వేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ ఆదేశాలు నేరుగా.. సీఎంవో నుంచి జిల్లా కలెక్టర్లకు అందాయి. ప్రభుత్వ పబ్లిసిటీ విభాగానికి కూడా వెళ్లాయి. కొద్ది రోజుల కిందట.. జగన్మోహన్ రెడ్డి ఫోటోలను.. ఇష్టం వచ్చినట్లుగా వాడేస్తున్నారని… ఏవి పడితే అవి వాడటం వల్ల.. ఆయన ఇమేజ్‌కు భంగం కలుగుతోందని.. చెబుతూ.. కేవలం రెండు అంటే.. రెండు ఫోటోలను మాత్రమే అధికారికంగా సర్క్యూలేట్ చేశారు. వాటిని మాత్రమే.. పబ్లిసిటీకి వాడాలని ఆదేశించారు. ఇప్పుడు… ఇతరుల ఫోటోలు కాకుండా.. ఒక్క జగన్ ఫోటో మాత్రమే ఉండాలని మరింత కట్టడి చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకు వెళ్లినా.. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా… ప్రచార చిత్రాల్లో అనేక మంది ఫోటోలు ఉంటున్నాయి. కొన్ని కొన్ని చోట్ల.. అధికారుల అత్యుత్సాహం కారణంగా.. ఆ ప్రోగ్రాంకు సంబంధించిన ఫోటోలు పెద్దవిగా ఉండి.. జగన్ ఫోటోలు చిన్నవిగా అవుతున్నాయి. దీన్ని గమనించిన జగన్… తనకు అవమానం జరిగినట్లుగా ఫీలైనట్లుగా తెలుస్తోంది. అందుకే తన ఫోటోలు మాత్రమే… పెద్దగా స్పష్టంగా కనిపించాలని .. మరెవరి ఫోటోలు ఉండకూడదని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
నిజానికి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం అయితే.. ఆ కార్యక్రమం ఉద్దేశాలు.. తెలిసేలా.. ఫోటోలు, వాక్యాలు రాస్తారు. ముఖ్యమంత్రి ఫోటో కాస్త పెద్దది వేస్తారు. ఆ తర్వాత సంబంధింత శాఖ మంత్రి, ఏదైనా జిల్లాల్లో టూర్ అయితే.. అక్కడి ఎమ్మెల్యే, ఎంపీల ఫోటోలు వేస్తారు. ఇక నుంచి అలాంటిదేమీ ఉండదు. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి కార్యక్రమం పెట్టినా.. ఒక్క జగన్ ఫోటో మాత్రమే ఉంటుంది.