జగన్ రెడ్డి దెందులూరు సిద్ధం సభలో ఏడ్చినంత పని చేశారు. రామాయణ, మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారని వారందరి నుంచి తనను రక్షించాలని ప్రజల్ని వేడుకున్నారు. రాజకీయంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న వారిని భౌతికంగా నిర్మూలించడానికి కూడా వెనుకాడని రాక్షస లక్షణాలున్న జగన్ రెడ్డి .. ఇతరుల నుంచి తనను కాపాడాలని ప్రజల్ని వేడుకోవడం .. ఏడ్చినంత పని చేయడం చూసి వైసీపీ క్యాడర్ కూడా నోరెల్లబెట్టింది. రామాయణం, మహాభారతం లోని విలన్లు, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టులు అంతా ఏకమయ్యారని జగన్ దెందులూరులో బాధపడ్డారు. ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించి అర్జునుడు అయిన నన్ను కౌరవుల నుండి రక్షించాలని పిలుపునిచ్చారు.
ఎప్పట్లాగే జగన్ రెడ్డి ప్రసంగం అంతా చంద్రబాబు, పవన్ , పురందేస్వరి, షర్మిలపై ఏడుపుతోనే సాగింది. ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు. చంద్రబాబు, ఎల్లో మీడియా ఏకమై కుట్ర చేస్తున్నారు. వాళ్ల వైపు నుంచి వీరందరికీ జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. కానీ, నిజం ఏంటంటే.. కోట్ల మంది హృదయాల్లో జగన్ ఉన్నాడు. జగన్ ఒంటరి వాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజంని తనకు తాను చెప్పుకున్నారు. నిజానికి ఆరేడు జిల్లాల నుంచి స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇచ్చి తలా ఐదు వందలు ఇచ్చి బెదిరించి తీసుకు వచ్చిన వారు ముఫ్ఫై వేల మంది కూడా లేరు. వచ్చిన వారు కూడా ప్రసంగం వినకుండా తిరుగుముఖం పట్టారు. ఆ కొద్ది మందినే కోట్లాది మందికి చెప్పుకుని జగన్ రెడ్డి తనకు తాను బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
పదే పదే జనాల్నే నమ్ముకున్నానని.. నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, కిందున్న మీరనేనని తన కోసం యుద్ధం చేయాలన్నట్లుగా మాట్లాడారు. పేదలపై యుద్ధం చేసింది జగన్ రెడ్డి. నకిలీ మద్యంలో పేదల రక్తం తాగింది జగన్ రెడ్డి. ఉచిత ఇసుక తీసేసి భారీగా దోచేసింది జగన్ రెడ్డి. రోజువారీ కూలీల ఉపాధిని దెబ్బతీసింది జగన్ రెడ్డి.. అయినా పేదల రక్తం తాగుతారంటూ.. నిర్మోహమాటంగ విపక్షాలపై నిందలు వేసేశారు. సిద్ధమా.. సిద్ధమా అంటూ.. ఎదుట వాళ్లను అడిగారు కానీ.. వారంతా.. ఎప్పుడు వెళ్లిపోదామా అనే మూడ్ లో ఉండి ఎవరూ గొంతు కలపలేదు.
ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించి అర్జునుడు అయిన నన్ను కౌరవుల నుండి రక్షించాలి. మేనిఫెస్టోను 100శాతం అమలు చేసిన ఘనత మనది. జరుగుతున్న అభివృద్ధి మీద టీడీపీ దండయాత్ర చేస్తోంది. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు చేధించేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని బతిమాలుకున్నారు. జగన్ రెడ్డి తీరు.. ప్రసంగం చూసి.. ఓడిపోయే ముందు ఏడ్పుగొట్టు సభలు పెట్టుకున్నట్లుగా వ్యవహారం ఉందన్న సెటైర్లు పడుతున్నాయి.