అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్ని అప్పనంగా సెంటు స్థలాల కోసం పంచడానికి రెడీ అయిపోయిన సీఎం జగన్ రెడ్డి అక్కడ ఇళ్లు కూడా కట్టాలని అనుకుంటున్నారు. కోర్టు తీర్పు తర్వాత తాను పంచే పట్టాలు పనికి రావేమోనన్న ఆందోళన ఆయనకు ఉంది. ఇళ్లు కట్టేస్తే వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా అమరావతిని విధ్వంసం చేశాన్న సంతృప్తి ఉంటుందని ఆయన అనుకుంటున్నట్లుగా ఉన్నారు. కానీ ఇళ్లు కట్టాలంటే డబ్బులు కావాలి. అవి ఉంటే ఈ సమస్య ఎందుకు ?. అందుకే ఆర్ 5 జోన్ లో యాభై వేల ఇళ్లు కడతానని డబ్బులివ్వాలని కేంద్రానికి లేఖ రాశారు.
ఇప్పటి వరకూ కేంద్రం ఇరవై లక్షల ఇళ్లు మంజూరు చేసింది.కానీ కట్టిన ఇళ్లు నాలుగో ఐదో. ఇంత వరకూ ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం జరగలేదు. కానీ కేంద్రానికి మాత్రం మరో యాభై వేల ఇళ్లకు ప్రతిపాదనలు పంపారు. అదీ కూడా ఆర్5 జోన్లో . సెంటు స్థలాలను అమరావతి రైతులు ఇచ్చిన భూములను ఇచ్చినప్పటికీ ఇళ్లు మాత్రం కేంద్ర నిధులతో నిర్మిస్తారు. కేంద్రం ఒక్కో ఇంటికి రూ. 1 లక్ష 80 వేలు ఇస్తుంది. అలాగే ప్రభుత్వం లబ్దిదారులకు పావలా వడ్డ కింద మరో రూ. 35వేలు ఇప్పిస్తోంది. ఈ మొత్తంతోఇళ్లు నిర్మించాలని అనుకుంటున్నారు. అయితే ముందుగా వీటికి కేంద్రం మంజూరు చేయాల్సి ఉంటంది.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూములు వివాదంలో ఉన్నందున వాటిలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒక వేళ అనుమతి ఇస్తే మాత్రం బీజేపీ, వైసీపీ కలిసే అమరావతిని నిర్వీర్యం చేస్తున్నాయన్న అభిప్రాయానికి జనం వస్తారు. మరో వైపు ఆర్- 5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి సాయం చేయవద్దంటూ కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి హర్ధీప్ పూరి కి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఇప్పుడు అందరి చూపు కేంద్రం వైపు ఉంది.