ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే టాస్క్ ను కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగా లోకేష్ నేతృత్వంలో ఓ సబ్ కమిటీ కూడా ఏర్పాటు అయింది. ఈ కమిటీ పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగుల కల్పనపై ఎప్పటికప్పుడు అవకాశాల కోసం పరిశీలన చేస్తోంది. ఈ క్రమంలో పెట్టుబడిదారుల నుంచి వారికి ఎదురవుతున్న మొదటి ప్రశ్న.. మళ్లీ జగన్ రాడని గ్యారంటీ ఏమిటి ?
రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం.. ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు.. ఎలాంటి రాయితీలు ఇస్తారని సాధారణంగా పెట్టుబడిదారులు అడుగుతారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ జగన్ రాడని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు. జగన్ వస్తే తమ పెట్టుబడులన్నీ నిర్వీర్యం అయిపోతాయని.. వాళ్లకు వాటాలు ఇచ్చుకోవాల్సి వస్తుందని.. అపుడు ఎవరికి చెప్పుకోవాలన్నది వారి ఆవేదన. పదేళ్ల కాలంలో ఏపీలో పెట్టుబడులు రాలేదు కానీ.. బెదిరించి కంపెనీల్ని రాయించేసుకున్నారు . ఇలాంటి నిర్వాకాలు ఢిల్లీ పెట్టుబడిదారుల వరుకూ ఉన్నాయి. కేంద్రానికి కూడా చాలా సార్లు ఫిర్యాదులు అందాయి. చివరికి ప్రభుత్వం మారిపోయింది. అత్యంత ఘోరంగా ఓడిపోయారు.
అయితే జగన్ మళ్లీ వస్తే.. తమ పరిస్థితి ఏమిటన్నది పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి వస్తున్న సందేహం. ఆయన దుర్మర్గాలకు చట్టపరంగా శిక్షలు ఖరారైతే ఇలాంటి సమస్య ఉండదు. కానీ కేసులు నత్తనడకన సాగుతున్నాయి. రాజకీయాలకు జగన్ లాంటి వ్యక్తి అన్ ఫిట్ అని.. చంద్రబాబు పలుమార్లు చెప్పారు. జగన్ వ్యవహారశైలి, పాలనా తీరు చూసిన ఎవరికైనా అదే అనిపిస్తుంది. డబ్బులు దోచుకుని కొంత పంచి.. వాళ్లను ఓటు బ్యాంక్ గా మార్చుకుని ముఫ్పై ఏళ్లు అధికారంలో ఉండాలన్నట్లుగా చేసిన రాజకీయం రాష్ట్ర ఇమేజ్ ను ఘోరంగా దెబ్బతీసింది. ఇప్పటికీ జగన్ పెట్టుబడిదారులకు బూచోడుగానే కనిపిస్తున్నారు.