వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించారు. కానీ ఆయన నియమించుకుంటున్న సలహాదారులు మాత్రం.. ఒక్కొక్కరికి రూ. నాలుగు లక్షల జీతభత్యాలు ఇస్తున్నారు. కొత్తగా.. తన సమీప బంధువు “డేటా చోరీ” పేరుతో ఎన్నికల ముందు హడావుడి చేసిన తుమ్మల లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని సలహాదారుగా నియమించుకున్నారు. సాంకేతిక ప్రాజెక్టుల సలహాదారుగా పదవి ఇచ్చి.. ఆయనకు దాదాపుగా రూ. నాలుగు లక్షల జీతభత్యాలు నిర్దేశించారు. అయితే.. ఈయన తన బంధువని అభిమానమో.. ఎన్నికలకు ముందు… సాయం చేశారనో కారణమో కానీ.. ఈయనకు జీతభత్యాలకు అదనంగా.. కొన్ని సదుపాయాలు కల్పించారు. అందులో.. అంతర్జాతీయ ప్రయాణాలకు.. బిజినెస్ క్లాస్ టిక్కెట్లు ఉచితం ఒకటి. ఆస్పత్రిలో చేరితే ఆ ఖర్చులు, ఇండియాలో ఎక్కడ .. తిరిగినా.. చార్జీలు కూడా.. ప్రభుత్వం చెల్లిస్తుందట.
సాధారణంగా బిజినెస్ క్లాస్ టిక్కెట్లు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రులు, సీఎస్ స్థాయి లాంటి వారికి మాత్రమే ఉంటాయి. అవి అత్యంత ఖరీదుతో కూడుకున్నవి. ప్రజాధనాన్ని అలా దుర్వినియోగం చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో చాలా మంది…అధికారులు, మంత్రులు.. బిజినెస్ క్లాస్ ను ఎంచుకోరు. ఎక్కడికి వెళ్లినా ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు. కానీ… ఎలాంటి అర్హతా లేని.. కేవలం జగన్ బంధువు అనే కారణంగా సలహాదారుగా నియమితులైన తుమ్మల లోకేశ్వర్ రెడ్డికి మాత్రం.. ఏకంగా బిజినెస్ క్లాస్ ప్రయాణాలకు పర్మిషన్ ఇచ్చారు. ఆయన వ్యక్తిగత పనులపై వెళ్లినా.. “ఆన్ డ్యూటీ” పెట్టేసుకుని క్యాష్ చేసుకోగల సౌకర్యం… ప్రభుత్వం ఆయనకు సలహాదారు పదవితోనే ఇచ్చింది.
ఎన్నికలకు ముందు… వైసీపీకి పని చేసిన పలువురికి సీఎం జగన్ సలహాదారుల పదవులతో సత్కరిస్తున్నారు. ఈ సలహాదారులంతా ప్రధానంగా… సాక్షి మీడియాలో పని చేస్తున్న వారో… లేకపోతే.. జగన్ బంధువులో అయి ఉంటున్నారు. ఇలాంటి వారిని ఇప్పటి వరకూ.. పదిమందికిపైగా నియమించారు. ఒక్కొక్కరికి రూ. నాలుగు లక్షల వరకు జీతభత్యాలు నిర్ణయించారు. దీనికి ఇప్పుడు బిజినెస్ క్లాస్‌లు అదనంగా కలుస్తున్నాయి. వీరు మాత్రమే కాదు… ఏపీఐఐసీ చైర్మన్ లాంటి నామినేటెడ్ పోస్టుల్లో నియమించే వారికి కూడా ప్రభుత్వం రూ. నాలుగు లక్షల జీతభత్యాలు ప్రకటించడం… అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రజాధనాన్ని సొంత వారికి… ఇలా పప్పుబెల్లాల్లా పంచడం.. గతంలో ఎప్పుడూ జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.