వైఎస్ జగన్మోహన్ రెడ్డి…. ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి పథకం.. ప్రైవేటు స్కూళ్లకు… బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతోంది. ఆ పథకం పేరుతో పోస్టర్లు వేసుకుని.. పిల్లలను స్కూళ్లలో చేర్పించుకునేందుకు… యాజమాన్యాలు కొత్త కొత్త స్కిట్లు ప్రదర్శిస్తున్నాయి. తమ స్కూల్లో పిల్లను చేర్చితే.. రూ. 15వేలు వస్తాయంటూ… చెబుతూ… ఫ్లెక్సీలు వేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో… పిల్లలను చేరకుండా… చేస్తున్నారు.
“అమ్మ ఒడి” పేరుతో ప్రచారం చేసుకుంటున్న ప్రైవేటు స్కూల్స్
సాధారణంగా.. ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే.. ప్రైవేటుకు సంబంధం లేకుండా చూసుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంక్షేమం కోసం… ఏపీలో.. ఉన్న ప్రతి చిన్నారికి.. విద్య అందేలా చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెడుతున్నారు. దీని ప్రకారం.. పిల్లల్ని స్కూలుకు పంపే తల్లికి రూ. 15వేలు ఇస్తామని ప్రకటించారు. అది ప్రైవేటు స్కూలా.. ప్రభుత్వ స్కూలా అన్నది మ్యాటర్ కాదు. స్కూల్‌కి వెళ్తున్నారా లేదా.. అన్నదే అసలైన అర్హత. అయితే.. మొదట్లో.. ఇది ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు పెరగడానికి కారణం అవుతుందనుకున్నారు. అయితే ప్రైవేటు స్కూళ్లు మాత్రం… విస్తృతంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రచారం చేసుకుని.. తమ స్కూల్లో చేరినా..ఆ పథకం ప్రకారం రూ. 15వేలు వస్తాయని చెబుతున్నారు. పిల్లల్ని చేర్పించేలా తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు.
తల్లులకు చెక్కులు.. స్కూళ్లకు డబ్బులు..!
ఫీజు రీఎంబర్స్మెంట్ సమయంలో.. ఇంజినీరింగ్ కాలేజీలు అక్రమాలకు పాల్పడ్డాయన్న ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్చుకుని.. వారి ఫీజులను ప్రభుత్వం నుంచి వసూలు చేశారు కానీ.. నాణ్యమైన విద్యను అందించలేదని తేలింది. ఇప్పుడు.. ఆ అవకాశం స్కూళ్లకు లభించినట్లుగా అయింది. విద్యార్థులను చేర్చుకుని… అమ్మ ఒడి పథకం కింద వచ్చే సొమ్మును.. ఫీజులో భాగంగా మినహాయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని స్కూళ్లు… స్కూలు ఫీజులో.. రూ. పదిహేను వేలు రాయితీ ఇస్తామని… ప్రభుత్వం .. ఇచ్చినప్పుడు ఇవ్వాలని… తల్లిదండ్రులకు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి… స్కూళ్లు.. ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు. ఎలాగూ ప్రభుత్వం ఇస్తోంది కదా.. అని ఫీజులు పెంచేశారు. ఇరవై శాతం వరకూ ఫీజులు పెంచేసి… కొంత రాయితీ ఇచ్చి… ప్రభుత్వం రూ. 15వేలు ఇస్తుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే… అమ్మ ఒడి పథకం.. ప్రైవేటుస్కూళ్ల యాజమాన్యాలకు కల్పతరువుగా మారనుంది.
ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు ఎలా..?
ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు.. అమ్మఒడి పథకాన్ని… తమకు తాము ప్రచారానికి ఉపయోగిచుకుంటే.. ఇక ప్రభుత్వ స్కూళ్లలో… ప్రవేశాలు దాదాపుగా నిలిచిపోతాయి. ఎందుకంటే.. ఇప్పటికే.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. దానికి తగ్గట్లుగానే విద్యార్థులూ తగ్గిపోతున్నారు. రూ. లక్షలకు దగ్గరగా జీతాలు తీసుకునే టీచర్లు.. అసలు భావిభవిష్యత్ ను తీర్చిదిద్దడం కన్నా… ఇతర వ్యవహారాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో.. అమ్మ ఒడి పథకం.. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తోందనే ఆందోళన పెరుగుతోంది. దీనికి ప్రభుత్వం విరుగుడు ఆలోచించాల్సి ఉంది.