జగపతి బాబు‘సముద్రం: ఇట్స్ మై లైఫ్’ పేరుతో తన బయోపిక్ ప్లాన్ చేశారు. 59 ఏళ్లుగా తన ప్రయాణం ఎలా సాగింది? నటుడిగా ఎలా మారారు? ఇతర భాషా చిత్రాల అవకాశాలు, కుటుంబం తదితర విషయాల్ని ఇందులో చెప్పాలనుకున్నారు. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని పక్కన పెట్టేశారు. ఈ విషయాన్ని స్వయంగా జగపతి బాబు చెప్పారు.
‘సముద్రం చాలా అంచనాలతో మొదలుపెట్టాను, అందులో నా జీవితం చెప్పాలనుకున్నాను. దాదాపు 11 గంటల పుటేజ్ వచ్చింది. కానీ నాకు నచ్చలేదు. నేను అనుకున్నట్లు లేదు. అందుకే దాన్ని పక్కన పెట్టేశాను. చాలా మెటిరియల్ వుంది. అది నేను అనుకున్నట్లు రాలేదు. భవిష్యత్ లో ఆ సెన్సిబిలిటీస్ వున్న దర్శకులు ఎవరైన వస్తే,. దాన్ని మళ్ళీ చేసే ఆలోచన అయితే వుంది” అని చెప్పుకొచ్చారు జగపతి బాబు.