వెండి తెరపై ఇప్పుడు నాన్న పాత్రలకు గిరాకీ బాగుంది. ఆ పాత్రల చుట్టే కథలు తిరుగుతున్నాయి. మంచి నాన్న, చెడ్డ నాన్న, విలన్ నాన్న, పరువు కోసం తపించే నాన్న, ఫ్యాక్టనిస్టు నాన్న.. బొమ్మరిల్లు నాన్న.. ఇలా చాలా నాన్న పాత్రలు తయారవుతున్నాయి. వీటన్నింటికీ పేటెంట్ హక్కులు తీసుకొన్న నాన్న.. జగపతిబాబు.ఇటీవల కాలంలో ఆయనకు నాన్న పాత్రలే ఎక్కువగా దక్కాయి.
ఇప్పుడు మరోసారి జగ్గూభాయ్కి ఓ మంచి నాన్న పాత్ర దొరికింది. `ఫాదర్ – చిట్టి – ఉమా – కార్తీక్` సినిమాతో. టైటిల్ పొడుగ్గా ఉన్నా పొయెటిక్ గా ఉంది. టైటిల్ బట్టి చూస్తే.. ఈ సినిమాలో నాన్న పాత్రకున్న ప్రాధాన్యత అర్థమైపోతోంది. నాన్నగా జగపతిబాబు నటిస్తున్నాడు. జగ్గూ భాయ్ పాత్ర, తన గెటప్ షాకింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. కార్తిక్, అమ్ము భరణి జంటగా నటిస్తున్నారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దామోదర ప్రసాద్ నిర్మాత. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన వివరాలు… అతి త్వరలో తెలుస్తాయి.