అడవిశేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గూఢాచారి’. శోభిత కథానాయికగా నటిస్తోంది. శశికిరణ్ దర్శకుడు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబుకి ఓ కీలక పాత్ర దక్కింది. జగ్గూభాయ్ ఈ సినిమాలో ఉన్నాడన్న విషయం ఇప్పటి వరకూ దాస్తూ వచ్చింది చిత్రబృందం. సినిమాలో సడన్ సర్ప్రైజ్గా చూపిద్దామనుకుంది. ఇటీవల కీలకమైన పాత్రలు వస్తున్నా… అందులో తనదైన మార్క్ వేయడంలో జగ్గూభాయ్ కాస్త వెనుకబడ్డాడు. అయితే `గూఢచారి`లో మాత్రం జగపతిబాబు పాత్ర చాలా డిఫరెంట్గా కొత్త కోణంలో సాగుతుందట. తన లుక్ కూడా విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.