లెజెండ్‌తో విలన్‌గా మారిన జగపతిబాబు.. పటేల్ సార్‌తో మరోసారి హీరో అవతారంలోకి వచ్చేశాడు. ఈ సినిమా ప్రోమోలు ఆసక్తి కలిగిస్తున్నాయి. దాంతో పాటు సాయి కొర్రపాటి నిర్మాత కావడం, ఆయన ఛాయిస్‌పై నమ్మకం ఉండడంతో పటేల్ సార్‌పై ఫోకస్ పెరిగింది. ఈనెలాఖరున రావాల్సిన సినిమా ఇది. హడావుడిగా 14నే విడుదల చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రమోషన్లలో జగపతిబాబు హవానే కనిపిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ… ఇప్పుడు మరోసారి హీరోగా తనని తాను పరీక్షించుకొంటున్నాడు కాబట్టి.. పటేల్ సార్ రిజల్ట్ జగ్గూభాయ్‌కి చాలా కీకలం. అందుకే మీడియా దగ్గర కూడా.. ”ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయండి.. మిమ్మల్ని ఎప్పుడూ ఏదీ అడగలేదు.. ఈ సినిమాని కాస్త చూసుకోండి” అంటున్నాడట.
నిజంగానే జగపతిబాబు తన సినిమాల్ని ఈ స్థాయిలో ఎప్పుడూ ప్రమోట్ చేసుకోలేదు. ఈ స్పెషల్ ఇంట్రస్ట్కి కారణమేంటా?? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పటేల్‌సార్ కి నిర్మాత సాయి కొర్రపాటినే అయినా… ఈ సినిమాలో జగపతిబాబుకీ పార్టనర్షిప్ ఉందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా తన సొంత నిర్మాణ సంస్థలోనే చేయాలని జగపతిబాబు ఫిక్సయ్యాడు. అయితే.. కొర్రపాటికి కథ నచ్చడం, ఆయనలాంటి నిర్మాత తోడుంటే.. ఈ సినిమాకి ఇంకా క్వాలిటీతో తీసుకొస్తామన్న భరోసా దొరకడంతో.. తను పార్టనర్‌గా మారాడని తెలుస్తోంది. అందుకే… వ్యక్తిగతంగా ఈ సినిమా రిజల్ట్‌పై జగపతిబాబు ఫోకస్ పెట్టాడని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.