చంద్రబాబు నాయుడిని పొగిడిన పాపానికి రజనీకాంత్‌ని ఆడిపోసుకొంటున్నారు వైకాపా పేటీఎమ్ బ్యాచ్. ఎంతకు దిగజారిపోయారంటే అప్పుడెప్పుడో జరిగిన సిల్క్ స్మిత ఆత్మహత్యకు సైతం రజనీనే బాధ్యుడంటూ… అర్థం పర్థం లేని వాదనల్ని బయటకు తీస్తున్నారు. మొన్నటి వరకూ పవన్‌ని తిట్టిన నోళ్లు… ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకొని, రజనీపై పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. తెలుగు ఇండస్ట్రీ నుంచి రజనీకి మద్దతుగా ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. అంతెందుకు.. నా ప్రియమైన స్నేహితుడు, వాడూ.. వీడూ అంటూ రజనీని ప్రేమారా పిలిచే మోహన్ బాబు సైతం కామ్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కి మద్దతుగా గొంతు విప్పాడు జగపతిబాబు.
రజనీకాంత్ – వైకాపా బ్యాచ్.. ఈ గొడవపై మీ స్పందనేంటి? అంటూ జగ్గూభాయ్ ని అడిగితే… ”ఆ గొడవ గురించి నాకు తెలీదు. కానీ రజనీకాంత్ ఏం మాట్లాడినా నిజాయితీగా మాట్లాడతారు. ఆయన తప్పుగా ఎప్పుడూ మాట్లాడరు” అంటూ తన మద్దతు తెలిపాడు. మరి ఆయన్ని వైకాపా వాళ్లు తిట్టుకొంటున్నారు కదా? అని అడిగితే ”మాట్లాడేవాళ్లు మాట్లాడుకొంటూనే ఉంటారు… అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని చెప్పుకొచ్చారు. రజనీ అంటే జగపతిబాబుకి ప్రత్యేకమైన అభిమానం. వీరిద్దరూ కలిసి `కథానాయకుడు` చిత్రంలో స్నేహితులుగా నటించారు.