సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి జోలికి వస్తే నాలుక కోస్తామని హెచ్చరించారు.
అరికపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి వివాదంపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అని ఆరోపించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ను ఒక్కసీటు గెలిపించలేదని అక్కసుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా రాజకీయాలు చేస్తున్నారన్నారు. తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ – కౌశిక్ రెడ్డిల వివాదం బీఆర్ఎస్ పార్టీకి చెందినదని, ఈ విషయంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని కేటీఆర్ ను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా , రేవంత్ ను విమర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని నిలదీశారు.
అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నారని , రేవంత్ , కాంగ్రెస్ నేతలపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పదేళ్లు పవర్ అనుభవించిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ వాదంపై మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. పార్టీలో కండువాకప్పే సంప్రదాయం తెచ్చింది కేసీఆర్ అని , పార్టీలు మారిన వాళ్ళకు ఆయన మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేసిన జగ్గారెడ్డి.. ఈ విషయంపై ముందుగా సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ అని డిమాండ్ చేశారు.