జాగ్వార్ గుర్తుంది కదా? కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, దేవగౌడ మనవడు నిఖిల్ గౌడ కథానాయకుడిగా పరిచయం అయిన చిత్రం. ఈ సినిమాపై దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనికి దర్శకత్వం వహించాడు మహదేవ్! ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఖర్చు తప్ప ఇంకేం కనిపించలేదు. ఇప్పుడు ఈ దర్శకుడికి లారెన్స్ ఛాన్స్ ఇచ్చాడు. మహదేవ్ చెప్పిన కథ లారెన్స్‌కి తెగ నచ్చేసిందని సమాచారం. ఈ కాంబోలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఇదో విభిన్నమైన జోనర్ అని, లారెన్స్‌ని కొత్త గా చూపించబోతున్నాడని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషలకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులూ ఈ టీమ్‌లో ఉంటారట. అయితే బడ్జెట్ విషయంలో మాత్రం ముందే కొన్ని హద్దులు పెట్టుకున్నార్ట. లారెన్స్ జోరు ఈమధ్య బాగా తగ్గింది. తన నుంచి సినిమాలేం రావడం లేదు. అయితే.. 2018లో మాత్రం 2 సినిమాల్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అందులో ఈ సినిమా కూడా ఉంటుందని సమాచారం.