జాన్వీ కపూర్ టాలీవుడ్ లో అడుగుపెట్టేసింది. ఎన్టీఆర్ ‘దేవర’తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఈ సినిమా విడుదల కాకుండానే రామ్‌చరణ్ – బుచ్చిబాబు ప్రాజెక్ట్‌లో కథానాయికగా ఫిక్సయ్యిందని వార్తలొచ్చాయి. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఖరారు చేయలేదు. ఇప్పుడు బోనీకపూర్ మాత్రం జాన్వీ ఎంట్రీ గురించి అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసేశారు. చరణ్ సినిమాలో జాన్వీ నటిస్తోందంటూ డిక్లేర్ చేసేశారు. ఓ ఇంటర్వ్యూలో జాన్వీ చేస్తున్న ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడిన బోనీ ”చరణ్‌తో కలిసి నటిస్తోంది. ఇది దైవానుగ్రహం” అంటూ కామెంట్ చేశారు. దాంతో.. చిత్రబృందం అధికారికంగా ప్రకటించకుండానే జాన్వీ ఎంపిక ఖాయమైనట్టైంది.
ఈ సినిమా కోసం జాన్వీ రూ.3 కోట్ల పారితోషికం తీసుకోబోతోందని కూడా వార్తలొస్తున్నాయి. తెలుగులో టాప్ హీరోయిన్స్‌కే ఈ స్థాయి పారితోషికం దక్కుతోంది. తన నుంచి ఒక్క సినిమా కూడా బయటకు రాకుండా, రూ.3 కోట్ల రేంజ్ కు చేరుకొందంటే మామూలు విషయం కాదు. తెలుగులో జాన్వీకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే జాన్వీ మాత్రం ఆచి తూచి అడుగులేస్తోంది. `టాప్ స్టార్స్‌తోనే నటిస్తా` అంటూ కండీషన్స్ కూడా పెడుతోంది. చిన్న, మధ్య స్థాయి హీరోల సినిమాల్ని జాన్వీ తిరస్కరిస్తోందని టాప్ లీగ్ లో ఉన్న హీరోల సినిమా అంటేనే మొగ్గు చూపిస్తోందని టాక్.