నందమూరి బాలకృష్ణ అనగానే పవర్ ఫుల్ డైలాగులే గుర్తొస్తాయి. అది మూడు గంటల సినిమా అయినా, ముఫ్ఫై సెకన్ల టీజర్ అయినా… బాలయ్య కనిపించాడంటే డైలాగ్ అదరగాల్సిందే. బాలయ్య 102వ చిత్రం `జై సింహా` టీజర్ కూడా.. 30 సెకన్లే. అయితే అందులోనే ఫ్యాన్స్‌కి కావల్సిన డైలాగ్స్ వినిపించేశాయి. బాలకృష్ణ – నయనతార కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రమిది. సంక్రాంతికి విడుదల అవుతోంది. ఈనెల 24న పాటల్ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు టీజర్ వచ్చేసింది. సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు.. అనే టిపికల్ బాలయ్య డైలాగ్‌తో టీజర్ మొదలైంది. సైలెంట్‌గా ఉందని కెలికితే.. తల కొరికేస్తది… అంటూ ఉగ్రరూపం చూపించాడు. నయన తార ప్రకాష్ రాజ్‌లను సింగిల్ ఫ్రేమ్కే పరిమితం చేశారు. మిగిలినవన్నీ బాలయ్య బిల్డప్ షాట్లే. జయ జయ జయ జయ నరసింహా – పగతో రగిలే నరసింహా అంటూ… వెనుక ఆర్.ఆర్ వినిపించింది. మొత్తానికి బాలయ్య అభిమానుల్ని అలరించేలానే టీజర్‌ని కట్ చేశారు. ఇది సెంటిమెంట్ సినిమా అని చెబుతున్నా – ఇప్పటి వరకూ బయటకు వచ్చిన ఫుటేజ్ మాత్రం – ఇదో యాక్షన్ సినిమా అనిపించేలా చేస్తున్నాయి. మరి ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో?