జైశ్రీరామ్.. ! కొత్త తరానికి ఇదో నినాదం అనే తెలుసు. ఇదొక రాజకీయ అంశమని కొంత మంది అనుకుంటూ ఉంటారు. సెంటిమెంట్ కోసం.. రాజకీయ పార్టీలు పెంచి పోషించాయని మరికొంత మంది అనుకుంటారు. కానీ.. శ్రీరాముడు భారతీయ జీవన వైవిధ్యంలో భాగం. ఆయన జీవన శైలినే ఇప్పటికీ… హిందూ దేశాలకు ఆదేశం. అక్కడి ప్రజలకు…, పుట్టిన పిల్లలకు.. రాముడి ఆదర్శాలే నేర్పుతారు. అలాంటి రాముడి జన్మస్థలం అయోధ్య. దేశంలో ఊరూవాడా… రాముడి కోవెలలు ఉంటాయి. కానీ ఆయన జన్మస్థలంలోనే ఆయనకు కోవెల లేదు. చారిత్రక కారణాలు ఏవైనా… ఆ రాముడి ఆలయాన్ని నిర్మించే దశకు వచ్చే సరికి రాజకీయం వచ్చి చేరింది. మరో వర్గ మనోభావాలతో ముడిపెట్టడంతో… ఆలయం నిర్మాణం కష్టం అయింది. చివరికి సాకారం అవుతోంది.
అయోధ్య.. ఒకప్పుడు.. హిందూ దేశాలన్నింటిలో ప్రసిద్ధ క్షేత్రం. కానీ ఆ తర్వాత అక్కడ రాముడి ఆనవాళ్లే కనిపించకుండా పోయాయి. చరిత్రలో ఏం జరిగిందో… చరిత్రకారులు ఎం చెప్పారో.. ఇక్కడ అసందర్భం. అక్కడకు వెళ్లాలనుకునే హిందువులు.. రాముడ్ని ఎక్కడ దర్శనం చేసుకుని రావాలో తెలియని పరిస్థితి. పోలీసుల ఆంక్షలు.,. ఉద్రిక్తతలు.. కోర్టుల పరిమితులు.., ఇలాంటి అనేక కారణాలతో రాముడికి ధైర్యంగా పూజలు చేయలేని దుస్థితి. కానీ ఇప్పుడు మారిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు ఇవ్వడంతో… అయోధ్య మళ్లీ .. రాముడి జన్మస్థలంగా ఠీవీగా నిలబడుతోంది.
దేశంలో ఓ తిరుమల.. ఓ పద్మనాభ స్వామి ఆలయం… మరో కాశీ .. ఇలా.. కొన్ని ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. త్వరలో అందులో అయోధ్య కూడా చేరనుంది. రాముడి జన్మభూమిలో…. ఆయన అద్భుత కోవెల .. మూడేళ్లలో సిద్ధం కానుంది. ఆ తర్వాత దేశంలో.. హిందువుల మొదటి తీర్థయాత్ర స్థలి.. అయోధ్యనే అయ్యే అవకాశం ఉంది. అందుకే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయోధ్యపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలను భాగం చేస్తున్నాయి.
ఒకప్పుడు.. అయోధ్య పెరేతెత్తితే… ఓ వర్గం ఉప్పొంగేది.. మరో వర్గం… చిటపటలాడేది. అలాంటి పరిస్థితుల్లో… కాలం చేసిన గాయాలు… గుర్తు రాకుండా చేసుకుని.. ఆలయాన్ని నిర్మించుకోవడంలో… భారతీయులు సక్సెస్ అవుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా… ఆలయాన్ని నిర్మించుకుంటున్నారు. ఇది భారతజాతి సాధించిన గొప్ప విజయం. ఇలాంటి సహనం.. ముందు ముందు ఉంటే… దేశంలో వైషమ్యాలే ఉండవు.