శ్రీనివాసరెడ్డి సినిమా – జంబలకిడి పంబ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈవీవీ సినిమాకీ, ఇప్పటి సినిమాకీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందన్న సంగతి తొలి రోజే తెలిసిపోయింది. కాన్సెప్ట్ బాగానే ఉన్నా – దర్శకుడెందుకో సరిగా వాడలేదని విమర్శలు వినిపించాయి. అయితే ఆ కాన్సెప్ట్ కూడా సొంతం కాదు. ఇది ఓ మలయాళ సినిమాకి ఫ్రీ మేక్. మలయాళంలో ‘ఇతిహాస్’ అనే సినిమా వచ్చింది. అది కూడా జెండర్ మార్పిడి కథే. హీరో హీరోయిన్గా, హీరోయిన్ హీరోగా మారతారు. అది ఓ ఉంగరం వల్ల. సేమ్ టూ సేమ్ ఇక్కడా అదే స్క్రీన్ ప్లే అప్లయ్ చేశాడు దర్శకుడు. కాకపోతే ఉంగరం బదులుగా ఆత్మ వచ్చి చేరింది. `ఇతిహాస్`లో కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. కనీసం ఆ సీన్లు లేపేసినా.. తెలుగులో ఈ సినిమా బాగా ఎక్కేది. ఈవీవీ టైటిల్నీ, మలయాళం కాన్సెప్ట్నీ బాగానే సెట్ చేసుకున్న మను… కథలో కామెడీని పండించలేకపోయాడు. ఇది మలయాళం ఫ్రీమేక్ అని శ్రీనివాసరెడ్డికి తెలుసో.. తెలీదో మరి.