కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకుని… హీరోగా తనకు నప్పే కథలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తున్న నటుడు శ్రీనివాసరెడ్డి. హీరోగా సరైన కథలు రాకుంటే కమెడియన్ వేషాలు వేసుకుంటున్నాడు. అతను హీరోగా నటించిన తాజా సినిమా ‘జంబ లకిడి పంబ’. సీనియర్ నరేష్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో గతంలో ఇదే టైటిల్‌తో ఒక సినిమా వచ్చింది. ఆ కథలో మెయిన్ పాయింట్ గుర్తుందా? శ్రీనివాసరెడ్డి కథలో మెయిన్ పాయింట్ కూడా అదే. అయితే ఈవీవీ సినిమాలో మగాళ్లు మహిళలగా, మహిళలు మగాళ్లకుగా ప్రవర్తిస్తారు. తాజా సినిమాలో కథ కొంచెం మారింది.
జెబి మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న శ్రీనివాసరెడ్డి ‘జంబ లకిడి పంబ’లో అమ్మాయి శరీరంలోకి అబ్బాయి ఆత్మ, అబ్బాయి శరీరంలోకి అమ్మాయి ఆత్మ ప్రవేశించడమే కథ అని టాక్. టీజర్ గమనిస్తే విడాకుల కోసం భార్యాభర్తలు లాయర్ దగ్గరకు వెళతారు. టీజర్ చివరికి వచ్చేసరికి ‘ప్రాబ్లమ్ అంతా అమ్మాయిలో వుంది’ అని అమ్మాయి, ‘అబ్బాయి చాలా ప్రాబ్లమ్’ అని అబ్బాయి అంటారు. కథేంటి? అనేది ఇక్కడే క్లారిటీ వచ్చింది. కాని దాన్ని నడిపించిన తీరు బాగుంది. అమ్మాయి ఫైట్ చేయడం వంటి అంశాల్లో కామెడీ వర్కవుట్ అయ్యింది. సినిమాలో ఎలా వుంటుందో మరి. శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ ఇవ్వడానికి వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి వంటి టాప్ కమెడియన్స్ ఎలాగో వున్నారు.