జమిలీ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గేది లేదని బీజేపీ సంకేతాలు ఇస్తోంది. ఈ విషయంపై ముందడుగు వేస్తామని అంటున్నారు. అయితే గతంలోలా బీజేపీకి లోక్ సభ లో సంపూర్ణమైన మెజార్టీ లేదు. మిత్రపక్షాలపై ఆధారపడి ఉంది. మరి జమిలీకి అందర్నీ ఒప్పించగలరా అన్నదే సందేహం. జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలపై జరుగుతున్న కుట్రగా ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే సపోర్టు చేయడం లేదు. అయితే విపక్షంలో ఉన్న పార్టీలన్నీ మద్దతిస్తున్నాయి.
కానీ ఏ ప్రభుత్వ కాల పరిమితి అయినా తగ్గిస్తామంటే ఎవరూ ఒప్పుకోరు. కావాలంటే గడువు పెంచి ఆ తర్వాత ఎన్నికలు పెట్టుకోవాలని అంటారు. ఆ ప్రకారం బీజేపీ ప్రణాళికల్ని సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి మొత్తం రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్ సహా ఇతర ఎన్నికలన్నీ జరిగిపోయేలా చూడాలని కేంద్రం నిర్ణయించుకుంది. కానీ అంతకు ముందే ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి రావొచ్చు.
బీజేపీ ఏకపక్షంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అందర్నీ ఒప్పించే.. జమిలీకి వెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు విషయంలో రెండు జాతీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఎలా పార్లమెంట్ తలుపులు మూసి అయినా సరే బిల్లు పాస్ చేసుకున్నారో… ఆ స్థాయిలో కాకపోయినా కనీసం కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలియచేయాల్సి ఉంటుంది.లేకపోతే బీజేపీపై ఏకపక్ష ముద్ర పడుతుది. అది ప్రస్తుత రాజకీ.య పరిస్థితుల్లో చాలా డేంజర్.