బీహార్లో జరిగిన నాలుగు స్థానాల ఉపఎన్నికల్లో స్టార్ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కు చెందిన రాజకీయ పార్టీ జన సురాజ్ పోటీ చేసింది. తన జనసురాజ్ ను రాజకీయ పార్టీగా మార్చిన తరవాత మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పార్టీకి బలమైన పునాదులు వేయాలనుకున్న ఆయన రిస్ తీసుకున్నారు. అయితే ఆయనకు ఆశించిన ఫ లితాలు రాలేదు. ఒక్క దాంట్లో గెలిచినా ఆయన పార్టీ సంచలనం సృష్టించినట్లు అయ్యేది.
కానీ నాలుగు స్థానాల్లోనూ ఓడిపోయారు. తక్కువ ఓట్లు వచ్చినప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా నిలబడ్డారు. ఆయన పార్టీకి చెంది జనసురాజ్ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఒకొక్కరికి పది హేను నుంచి ఇరవై వేల వరకూ ఓట్లు వచ్చాయి. అంటే ప్రశాంత్ కిషోర్ ఓటర్లలో కాస్త కదలిక తీసుకు వచ్చారని అనుకోవచ్చు. బీహార్ రాజకీయాలు అంటే మొదటి నుండి కుల, మత సమీకరణాల ఆధారంగానే ఉంటాయి. అలాంటి చోట ప్రశాంత్ కిషోర్ భిన్నమైన స్ట్రాటజీతో ముందడుగు వేస్తున్నారు
ఆయన మూడో ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టిలో ఉంటే మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒక్కో స్థానంలో ఇర వేల వరకూ ఓటు బ్యాంకు ఉంటే.. ఫలితాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నట్లే. అయితే పోల్ స్ట్రాటజీలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు చేయడం. మరీ పీకే తనకు చెప్పడమే కాదు చేసి చూపించడం కూడా వచ్చేమో నిరూపిస్తారేమో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ వేచి చూడాలి.