తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఇంకా జోష్ తగ్గలేదు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక వస్తుందని తేలిన తర్వాతే వెలుగులోకి వచ్చిన జానారెడ్డి తాను పార్టీ మారకుండా ఉండాలంటే.. పార్టీ హైకమాండ్‌కు చాలా షరతులు పెడుతున్నారు. అందులో మొదటిది.. తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడం. నేరుగా చెప్పకపోయినా.. అదే విషయాన్ని ఆయన పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిగం ఠాగూర్‌కు చెప్పినట్లుగా ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. జానారెడ్డిని తమ పార్టీలోకి తీసుకుని.. ఆయనను లేదా.. ఆయన కుమారుడ్ని… నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి నిలబెట్టాలని.. బీజేపీ, టీఆర్ఎస్ కూడా ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో జానారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అయింది. నిన్నటి వరకూ ఈ అంశంపై స్పందించని జానారెడ్డి.. మాణిగం ఠాగూర్ హైదరాబాద్ వచ్చారని తెలిసిన తర్వాత గాంధీభవన్‌కు వచ్చారు. పార్టీ మారడంలేదని.. బయట జరుగుతున్న ప్రచారంతో తనకు సంబంధం లేదన్నారు. పీసీసీ చీఫ్ పోస్టుపైనా… ఇతర అంశాలపైనా తన అభిప్రాయాలు చెప్పారు. అదే సమయంలో నాగార్జున సాగర్ నుంచి తాను పోటీ చేయనని.. తమ కుమారుడే పోటీచేస్తాడని చెప్పారు. రాహుల్ గాంధీనే చెప్పినా.. తాను విననని చెప్పారు. అయితే ఆయన ఈ నిబంధన పెట్టడం వెనుక ఓ షరతు ఉందని చెప్పకనే చెప్పారు. తాను పార్టీ ఎందుకు మారతానని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తాను ముఖ్యమంత్రి అభ్యర్థినని.. ఆయన చెప్పుకుటున్నారు. తన స్థాయి లాంటి నేతలపై పార్టీ మార్పు వార్తలు సమంజసం కాదంటున్నారు. అక్కడే జానారెడ్డి ఆలోచనలు పార్టీ హైకమాండ్‌కు చేరుతున్నాయంటున్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను గుర్తిస్తే.. పార్టీ తరపున ఉంటానని.. లేకపోతే లేదన్నట్లుగా జానారెడ్డి వ్యవహారశైలి ఉందని పార్టీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి.. జానారెడ్డి సీఎం అభ్యర్థి ఊహల్లో ఉన్నారు. ఉద్యమంలో కూడా ఒకటి, రెండు సార్లు ఉద్యమకారులనుద్దేశించి.. తెలంగాణ వస్తే కాంగ్రెస్ తరపున తానే సీఎంనని చెప్పేవారు. తెలంగాణ వచ్చినా.. పార్టీ అవసాన దశకు వెళ్లినా… జానా రెడ్డి ఆశలో మాత్రం మార్పు రాలేదని కాంగ్రెస్ నేతలు గొణుక్కుంటున్నారు.