నాగార్జున సాగర్ బరిలో నిలబడేందుకు జానారెడ్డి ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. నిన్నామొన్నటిదాకా తన కుమారుడికి రాజకీయ అవకాశాన్ని కల్పించడానికి చేయాల్సిన ప్రయత్నమంతా చేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం.. జానారెడ్డి మాత్రమే బరిలో ఉండాలని తేల్చి చెప్పడంతో.. ఆయన మనసు మార్చుకున్నారు. పైగా… జానారెడ్డి పోటీ చేస్తారా.. ఆయన కుమారుడు బరిలో ఉంటారా అన్నదానిపై సందేహాలు రావడంతో…నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీలోనూ గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో కొంత మంది నేతలు పార్టీలు మారిపోయారు. బీజేపీ .. ఎలాగైనా బలపడాలని ప్రయత్నిస్తూండటంతో జానారెడ్డి అనుచరుల్ని లాగేసుకుంటోంది.
మరో వైపు టీఆర్ఎస్ కూడా సిట్టింగ్ సీటును గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. ఈ ప్రయత్నాలన్నింటి మధ్య.. ఎంతో కొంత ఆశలు ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీ… జానారెడ్డి సృష్టించిన గందరగోళంతో అవకాశం మిస్సవుతున్నామేనోనని ఆందోళన చెందింది. చివరికి… జానారెడ్డి ఈ పరిస్థితికి తెరదించారు. తానే సాగర్ బరిలో ఉంటానని ప్రకటించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం.. జానారెడ్డికి పెట్టని కోట లాంటిదే.అయితే అది గతంలో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
జానారెడ్డి ప్రధాన అనుచరునిగా ఉంటూ… నాగార్జన సాగర్ కార్యకలాపాలన్నీ చక్క బెట్టే… భాస్కరావుకు మిర్యాల గూడ టిక్కెట్ ఇప్పించి గెలిపించారు. అయితే తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరిపోయారు. అప్పట్నుంచి సాగర్లో జనాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో భాస్కర్ రావు గెలిచాడు..కానీ సాగర్లో జానారెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు కూడా భాస్కర్ రావు టీఆర్ఎస్ కోసమే పని చేస్తారు. ఈ సవాళ్లన్నింటినీ జానారెడ్డి అధిగమించాల్సి ఉంది.