నిన్న అనంతపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కవాతు మరియు బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తూ, జనసేన కవాతు లో పాల్గొన్న ఈ నలుగురు జనసేన అభిమానులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు జనసేన అభిమానులు అనంతపురంలో జరిగిన జనసేన కవాతు కి హాజరయ్యారు. అద్దె వాహనాన్ని మాట్లాడుకుని వీరు అనంతపురం చేరుకున్నారు. అయితే, సభ అనంతరం తిరిగి వెళ్తుండగా హైవే మీద వీరు ప్రయాణిస్తున్న కారు వోల్వో బస్సు ఢీకొంది. అయితే టర్నింగ్ వద్ద కూడా అతి వేగంతో ప్రయాణించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా, కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.
పోలీసులు ప్రమాదానికి గల అసలు కారణాల పై దర్యాప్తు చేస్తున్నారు.